భార‌త్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జ‌ట్టు.. ఎందుకంటే? | New Zealand arrives in Greater Noida to play historic Test match but not against India | Sakshi
Sakshi News home page

భార‌త్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జ‌ట్టు.. ఎందుకంటే?

Sep 5 2024 2:08 PM | Updated on Sep 5 2024 2:56 PM

New Zealand arrives in Greater Noida to play historic Test match but not against India

న్యూజిలాండ్‌-అఫ్గానిస్తాన్ మ‌ధ్య చారిత్ర‌త్మ‌క టెస్టు మ్యాచ్‌కు గ్రేటర్ నోయిడా ఆతిథ్య‌మివ్వ‌నుంది. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న‌ ఈ మ్యాచ్ సెప్టెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అఫ్గానిస్తాన్ జ‌ట్టు ఇప్ప‌టికే నోయిడాకు చేరుకోగా.. తాజాగా కివీస్ జ‌ట్టు సైతం భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టింది.

కెప్టెన్ టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ జ‌ట్టు గురువారం తెల్లవారుజామునఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్క‌డ నుంచి గ్రేటర్ నోయిడాకు బ‌స్సులో కివీస్ పయ‌నమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

శుక్ర‌వారం నుంచి బ్లాక్ క్లాప్స్ త‌మ ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్ట‌నుంది. కాగా ఈ మ్యాచ్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరగనుండడంతో కివీస్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.

అఫ్గాన్‌ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్ కీప‌ర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీప‌ర్‌), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్

 

Advertisement
 
Advertisement
Advertisement