ఫిఫా ప్రపంచకప్‌లో మెక్సికో రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. శుక్రవారం గ్రూప్-ఏలో సౌత్‌కొరియాతో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 1-0తో విజయాన్ని అందుకుంది. మెక్సికో తరఫున లూయిస్ రొమో ఆట 50వ నిమిషంలో గోల్ సాధించాడు. ఈ విజయంతో గ్రూప్ దశలో రెండు విజయాలు సాధించిన మెక్సికో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే తర్వాతి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)కు క్వాలిఫై అయింది.
కాగా దక్షిణ కొరియా మ్యాచ్ మొత్తంలో రెండుసార్లు మాత్రమే మెక్సికో గోల్‌పోస్టుపై దాడులు చేయడం గమనార్హం. అయితే ఈ రెండుసార్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమైన దక్షిణ కొరియా ఓటమి దిశగా సాగింది. ఇక ఆరు పాయింట్లతో మెక్సికో తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించగా, ఇదే గ్రూప్‌లో ఉన్న సౌత్ కొరియా మూడు పాయింట్లు, చెక్ రిపబ్లిక్, సౌతాఫ్రికా ఖాతాలో ఒక్కో పాయింట్ ఉన్నాయి.
మెక్సికో తన చివరి మ్యాచ్‌ను చెక్ రిపబ్లిక్‌తో ఆడనుంది. కాగా ప్రతీ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించనున్న సంగతి తెలిసిందే.
చదవండి: గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్!


