బోణీ కొట్టిన బ్రెజిల్‌.. నాకౌట్‌కు అడుగు దూరంలో! | Matheus Cunha’s Brace Powers Brazil To 3-0 Win Over Haiti In FIFA World Cup 2026, Check More Details Inside | Sakshi
Sakshi News home page

బోణీ కొట్టిన బ్రెజిల్‌.. నాకౌట్‌కు అడుగు దూరంలో!

Jun 20 2026 9:03 AM | Updated on Jun 20 2026 10:25 AM

Matheus Cunha-Double Goals-Brazil Defeat-Haiti FIFA WC 2026

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మాజీ చాంపియ‌న్ బ్రెజిల్ బోణీ కొట్టింది. మొరాకోతో జ‌రిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన బ్రెజిల్ శ‌నివారం హైతీతో మ్యాచ్‌లో 3-0తో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. బ్రెజిల్ త‌ర‌ఫున మాథ్యూస్ కుహా (ఆట 23, 36వ నిమిషాలు) గోల్స్ చేయ‌గా, స్టార్ ప్లేయ‌ర్ వినిసియ‌స్ జూనియ‌ర్ హాఫ్ టైమ్ ముందు (45+3వ నిమిషం) గోల్ చేశాడు. 

రెండో హాఫ్‌లో ఇరుజ‌ట్లు గోల్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. అయితే రెండో సగంలో బ్రెజిల్ ప‌లుమార్లు హైతీ గోల్ పోస్టుపై దాడులు చేసిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు గోల్ కీప‌ర్ వాటిని స‌మ‌ర్థంగా అడ్డుకున్నాడు. ఈ విజ‌యంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న బ్రెజిల్ ప‌ట్టిక‌లో తొలి స్థానంలో కొన‌సాగుతుంది. త‌దుప‌రి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హ‌త సాధించేందుకు బ్రెజిల్ అడుగుదూరంలో నిలిచింది.

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఒక మ్యాచ్‌లో మూడు గోల్స్ అంత‌కంటే ఎక్కువ కొట్ట‌డం బ్రెజిల్‌కు ఇది 41వ సారి కావ‌డం విశేషం. బ్రెజిల్ త‌ర్వాత జ‌ర్మ‌నీ (36 సార్లు) మాత్ర‌మే అత్య‌ధికంగా మూడు గోల్స్ కొట్టిన సంద‌ర్భాలున్నాయి. ఇక బ్రెజిల్ స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. గాయంతో బాధ‌ప‌డుతున్న నెయ్‌మ‌ర్ లీగ్ ద‌శ‌లో ఈ నెల 24న స్కాట్లాండ్‌తో చివ‌రి మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. నెయ్‌మ‌ర్ లేకున్నా తాము విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌ని బ్రెజిల్ జ‌ట్టు నిరూపించింది.

చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement