సెమీస్‌లో లక్ష్యసేన్‌ ఓటమి  | Lakshyasen defeat in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో లక్ష్యసేన్‌ ఓటమి 

Mar 17 2024 4:15 AM | Updated on Mar 17 2024 4:15 AM

Lakshyasen defeat in the semis - Sakshi

బర్మింగ్‌హమ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఈ సారీ పతకం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పురుషుల ఈవెంట్‌లో ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 2022 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల లక్ష్యసేన్‌పై ఈ సారి భారత బృందం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శనివారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌తో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి.

పురుషుల సింగిల్స్‌లో జరిగిన సెమీస్‌లో భారత ఆటగాడు 12–21, 21–10, 15–21తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు ఎదురు నిలువలేకపోయిన లక్ష్యసేన్‌ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ క్రిస్టీకి కష్టాలు తప్పలేదు.

ఈ గేమ్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో ఆ పట్టుదల కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ వరుసగా ఫ్రెంచ్‌ ఓపెన్, ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యసేన్‌ బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్‌ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపర్చుకున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement