'అతడు పేరుకే స్పిన్నర్‌.. చూస్తుంటే నవ్వొస్తోంది" | K Srikkanth slams Indian spinner after IND vs PAK Asian Games 2026 final | Sakshi
Sakshi News home page

IND vs PAK: 'అతడు పేరుకే స్పిన్నర్‌.. చూస్తుంటే నవ్వొస్తోంది"

Oct 4 2026 12:58 PM | Updated on Oct 4 2026 1:22 PM

K Srikkanth slams Indian spinner after IND vs PAK Asian Games 2026 final

ఆసియా క్రీడ‌లు-2026 క్రికెట్ టోర్నీని భారత్ ఘనంగా ముగించింది. శ‌నివారం జ‌రిగిన ఉత్కంఠభరిత ఫైన‌ల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 19 ప‌రుగుల తేడాతో విజయం సాధించి, వ‌రుస‌గా రెండోసారి ప‌సిడి ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ఛాంపియ‌న్‌గా నిలిచినప్పటికీ, యువ లెగ్ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ మాత్రం బౌలింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు.

ఈ మ్యాచ్‌లో గ‌ల్లీ బౌల‌ర్ కంటే దారుణంగా బౌలింగ్ చేస్తూ పాక్ బ్యాట‌ర్ల‌కు సులువుగా ప్యాంట్ అయ్యేలా పరుగులు ఇచ్చాడు. రాజ‌స్తాన్‌కు చెందిన ఈ 26 ఏళ్ల స్పిన్న‌ర్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 14.70 ఎకానమీతో ఏకంగా 44 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌ బౌలింగ్ తీరుపై భారత మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

"ఈ టోర్నీలో కోరోగి స్పోర్ట్స్ పార్క్ మైదానం స్పిన్న‌ర్ల‌కు ఎంతగానో అనుకూలించింది. పేసర్ల కంటే స్పిన్నర్లే అక్కడ పండుగ చేసుకున్నారు. కానీ మన స్పిన్నర్ బిష్ణోయ్ మాత్రం దారుణ ప్రదర్శన చేశాడు. స్పిన్‌కు అనుకూలించే వికెట్‌పై కూడా బంతిని తిప్పకలేకపోతే అతడేం స్పిన్నరో నాకు అర్థం కావడం లేదు.

బౌలింగ్ వేసే సమయంలో అతడి శరీరం తప్ప బంతి మాత్రం అస్సలు తిరగదు. లెగ్-స్పిన్నర్ అయి ఉండి కూడా ట‌ర్న్‌ లభించే పిచ్‌పై బంతిని తిప్పలేకపోవడం బిష్ణోయ్‌కే సాధ్యమైంది. అది కూడా ఒక కళే! కొంతమంది అతనికి అనవసరంగా హైప్ ఇస్తుంటారు, గొప్ప బౌలర్ అని ఆకాశానికెత్తుతారు.

పది మ్యాచ్‌ల్లో విఫలమైనా ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తే చాలు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడని పొగుడుతారు. లెగ్-స్పిన్నర్ అంటే ముందు బంతిని టర్న్ చేయడం నేర్చుకోవాలి. పాకిస్థాన్ సాధారణ స్పిన్నర్లు, చివరకు మన పార్ట్-టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కూడా బంతిని చక్కగా స్పిన్ చేయగలిగారు" అని శ్రీకాంత్ విమర్శించాడు.
చదవండి: IND vs AUS: యువ‌రాజ్ విధ్వంసం.. ఆసీస్‌ను చిత్తు చేసిన భార‌త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement