WI Vs UGA: చెలరేగిన విండీస్‌ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్‌ | WI Vs UGA: Johnson Charles Russell Stars West Indies Score 175 Against Uganda, See Details | Sakshi
Sakshi News home page

T20 WC 2024: చెలరేగిన విండీస్‌ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్‌

Jun 9 2024 8:11 AM | Updated on Jun 9 2024 2:37 PM

johnson charles russell Stars west indies score 175 against uganda

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా గ‌యానా వేదిక‌గా ఉగండాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్లు చెల‌రేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

విండీస్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ జాన్స‌న్ చార్లెస్‌(44) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌స్సెల్‌(30 నాటౌట్‌), పావెల్(23), పూర‌న్‌(22) ప‌రుగుల‌తో రాణించారు. ఓ ద‌శ‌లో విండీస్ ఈజీగా 200 ప‌రుగుల మార్క్ దాటుతుంద‌ని అంతా భావించారు. 

కానీ ఉగండా బౌల‌ర్లు ఆఖ‌రి 6 ఓవ‌ర్లలో క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో 200 ప‌రుగుల మార్క్‌ను క‌రేబియన్లు దాట‌లేక‌పోయారు. ఉగండా బౌల‌ర్ల‌లో కెప్టెన్‌ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్‌ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement