పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ‌.. | Sakshi
Sakshi News home page

IPL 2024: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ‌..

Published Sat, May 18 2024 5:05 PM

Jitesh Sharma To Lead Punjab Kings In Their Final IPL 2024 Match

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో తమ చివ‌రి మ్యాచ్ ఆడేందుకు  పంజాబ్ కింగ్స్ సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో  పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క‌మ్రించిన‌ పంజాబ్‌.. క‌నీసం త‌మ చివ‌రి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజ‌న్‌ను ఘ‌నంగా ముగించాల‌ని భావిస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేష్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. పంజాబ్ త‌త్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శామ్ కుర్రాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయాడు.

ఈ క్ర‌మంలోనే  చివ‌రి మ్యాచ్‌లో పంజాబ్ జ‌ట్టుకు జితేష్ శ‌ర్మ నాయక‌త్వం వ‌హించ‌నున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూల‌ర్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ గాయం కార‌ణంగా సీజ‌న్‌లో మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. 

దీంతో సామ్‌కుర్రాన్‌కు జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను పంజాబ్ అప్ప‌గించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వ‌దేశానికి వెళ్లిపోవ‌డంతో జితేష్ జ‌ట్టును ముందుండి న‌డిపించ‌నున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌.. ఐదింట విజ‌యం సాధించింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement