జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. ఫస్ట్‌ ఓవర్‌ కింగ్‌గా | Jasprit Bumrah Overtakes Rabada, Starc To Achieve Special Feat In Tests | Sakshi
Sakshi News home page

IND vs ENG: జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. ఫస్ట్‌ ఓవర్‌ కింగ్‌గా

Jun 21 2025 10:07 PM | Updated on Jun 21 2025 10:07 PM

Jasprit Bumrah Overtakes Rabada, Starc To Achieve Special Feat In Tests

టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 2021 నుంచి తొలి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా బుమ్రా నిలిచాడు. లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఈ రేర్ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

2021 నుంచి బుమ్రా ఇప్ప‌టివ‌ర‌కు తొలి ఓవ‌ర్‌లో 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్‌, ఆసీస్ ప్రీమియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్ద‌రూ తొలి ఓవ‌ర్‌లో 7 వికెట్లు ప‌డ‌గొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ ఇద్ద‌రి పేస‌ర్ల‌ను బుమ్రా అధిగ‌మించాడు.

ఇంగ్లండ్ ఓపెనర్‌ మైండ్ బ్లాంక్‌..
కాగా బుమ్రా తొలి ఓవర్‌లోనే క్రాలీని బోల్తా కొట్టించాడు. మొదటి ఓవర్‌లో ఐదో బంతిని బుమ్రా.. క్రాలీకి మిడిల్ స్టంప్‌పై అవుట్-స్వింగర్ వేశాడు. క్రాలీ ఆ బంతిని లెగ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 4 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.

ధీటుగా బ‌దులిస్తున్న ఇంగ్లండ్‌..
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 471 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 359/3 ఓవ‌ర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన టీమిండియా అద‌నంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్‌తో పాటు కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌), య‌శ‌స్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీల‌తో చెల‌రేగారు.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో  కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయ‌క్ బ‌షీర్ చెరో వికెట్ సాధించారు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో29 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రెండు వికెట్ న‌ష్టానికి 126 ప‌రుగులు చేసింది. రెండు వికెట్లు కూడా బుమ్రానే ప‌డగొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement