
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టుకు అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ తన పేలవ ఫామ్ కారణంగా తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగాడు.
కానీహెడ్ కోచ్ గౌతం గంభీర్ కావాలనే అతడిని జట్టు నుంచి తప్పించాడని రూమర్స్ వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ఈ సిరీస్‌లో బ్రాడ్‌కాస్టర్ బృందంలో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ టెస్టు క్రికెట్‌లో ఇబ్బంది పడుతున్నప్పటికి రోహిత్‌కు బ్రాడ్‌కాస్టర్లు మద్దతుగా నిలిచారని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే అతడు ఎప్పుడో జట్టులో చోటు కోల్పోయే వాడని పఠాన్ అన్నారు.
"వైట్-బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం క్రమంగా ఫామ్‌లో స్థిరత్వం లోపించింది. ముఖ్యంగా గతేడాది అతడు సగటు చాలా పేలవంగా ఉంది. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే ఎప్పుడో టెస్టు జట్టులో తన స్ధానాన్ని కోల్పోయేవాడు.
రోహిత్ శర్మకు మేము అవసరానికి మించి మద్దతు ఇచ్చామని చాలా మంది విమర్శించారు. మీరు ఒకరిని ఇంటర్వ్యూకి ఆహ్వానించి వారితో తప్పుగా ప్రవర్తిస్తారా? వారు ఎటువంటి స్థితిలో ఉన్న మనం గౌరవంగా వ్యవహరించాలి. మేము కూడా ఆదే చేశాము.
ఎందుకంటే అతడు మా అతిథి. అతడికి మేము సపోర్ట్‌గా నిలుస్తూనే, తన ఫామ్‌ను మెరుగుపరుచుకోవాలని మేము సూచించాము. కానీ అతడు అప్పటికే తుది జట్టులో చోటుకు అనర్హుడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చాడు. 38 ఏళ్ల హిట్‌మ్యాన్ తన కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. రోహిత్ స్ధానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: సచిన్‌కు కాబోయో కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?