ఐపీఎల్‌ 2026లో అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఏది..? | IPL 2026 Fast Bowling Rankings: Which Team Had The Most Fearsome Pace Attack | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2026లో అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఏది..?

Jun 3 2026 6:56 PM | Updated on Jun 3 2026 7:36 PM

IPL 2026 Fast Bowling Rankings: Which Team Had The Most Fearsome Pace Attack

ఐపీఎల్‌ 2026లో బ్యాటర్ల హవా కొనసాగినా, పేస్‌ బౌలర్లు కూడా తమదైన ముద్ర వేశారు. ఈ సీజన్‌లో అత్యధిక 200+ స్కోర్లు నమోదైనా, కొన్ని జట్లు తమ బలమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ దళంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాయి. సీజన్‌ మొత్తంలో ఏ జట్టుకు అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఉందో ఈ కంటెంట్‌లో చూద్దాం. చివరి నుంచి మొదలుపెడితే..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (2/10)
ఈ సీజన్‌లో అత్యంత బలహీనమైన పేస్‌ అటాక్‌ కేకేఆర్‌ది అని చెప్పవచ్చు. హర్షిత్‌ రాణా, మతీష పతిరణ గాయాలతో దూరమవ్వడం ఈ సీజన్‌లో ఆ జట్టుకు భారీ దెబ్బ. కార్తీక్‌ త్యాగి 18 వికెట్లు తీసినా మిగతా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

పంజాబ్‌ కింగ్స్‌ (2/10)
ఈ జట్టులో అర్షదీప్‌ సింగ్‌ వంటి స్టార్‌ పేసర్‌ ఉన్నప్పటికీ, మిగతా పేసర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరి కారణంగా కీలక మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోలేకపోయారు.

ముంబై ఇండియన్స్‌ (3/10)
ఈ జట్టు పేస్‌ దళం ఈ సీజన్‌లో అతిపెద్ద నిరాశగా నిలిచింది. బుమ్రా, బౌల్ట్‌ లాంటి స్టార్‌ పేసర్లు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (4/10)
ఈ జట్టు తరఫున అన్షుల్‌ కంబోజ్‌ 21 వికెట్లతో మెరిసినా.. గాయాలు, అస్థిర ప్రదర్శనల కారణంగా పేస్‌ విభాగం బలహీనంగా కనిపించింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ (4/10)
ఈ జట్టులో స్టార్క్‌, నటరాజన్‌ కొంత మేర రాణించినా, మిగతా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (5/10)
ఈ సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ చివరి స్థానంలో నిలిచినా, పేస్‌ బౌలింగ్‌లో మంచి సామర్థ్యం చూపింది. ప్రిన్స్‌ యాదవ్‌, షమీ ఆకట్టుకున్నారు. అయితే గాయాలు జట్టును దెబ్బతీశాయి.

రాజస్థాన్‌ రాయల్స్‌ (6/10)
ఈ సీజన్‌లో రాయల్స్‌ విజయాల్లో జోఫ్రా ఆర్చర్‌ కీలక పాత్ర పోషించాడు. 25 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (7/10)
ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేస్‌ విభాగం బలంగా కనిపించింది. కమిన్స్‌ నేతృత్వంలో ఆ జట్టు పేస్‌ దళం మంచి సమతుల్యతను ప్రదర్శించింది. ఎషాన్‌ మలింగ 20 వికెట్లతో మెరిశాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (8/10)
బ్యాక్‌ టు బ్యాక్‌ టైటిళ్లు గెలవడంలో ఆర్సీబీ పేస్‌ బౌలర్ల పాత్ర అమోఘం. భువనేశ్వర్‌ కుమార్‌ 28 వికెట్లతో అదరగొట్టగా, రసిక్‌ సలా​ం​,‍ హాజిల్‌వుడ్‌ మంచి ప్రదర్శనలు ఇచ్చారు.

గుజరాత్‌ టైటాన్స్‌ (9/10)
ఈ సీజన్‌లో అత్యంత భయంకరమైన పేస్‌ దళం మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌దే. ఈ జట్టులోని రబాడ, సిరాజ్‌, హోల్డర్‌, ప్రసిద్ద్‌ సమిష్టిగా సత్తా చాటారు. 29 వికెట్లు తీసి రబాడ పర్పుల్‌ క్యాప్‌ కూడా గెలుచుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement