ఢిల్లీపై సీఎస్‌కే గ్రాండ్‌ విక్టరీ | IPL 2026: Chennai super kings vs delhi capitals live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ఢిల్లీపై సీఎస్‌కే గ్రాండ్‌ విక్టరీ

Apr 11 2026 7:02 PM | Updated on Apr 11 2026 11:30 PM

IPL 2026: Chennai super kings vs delhi capitals live Updates

Chennai super kings vs delhi capitals live Updates: 

ఢిల్లీపై సీఎస్‌కే గ్రాండ్‌ విక్టరీ
ఐపీఎల్‌-2026లో సీఎస్‌కే తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్‌(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్‌ నిస్సాంక(41), అశుతోష్‌ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్‌ మూడు, ఖలీల్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌ తలా వికెట్‌ సాధించారు.

ఓటమి దిశగా ఢిల్లీ
ఢిల్లీ విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్‌(60), కుల్దీప్‌ యాదవ్‌(3) ఉన్నారు.

ఢిల్లీ ఆరో వికెట్‌ డౌన్‌
అశుతోష్‌ రూపంలో ఢిల్లీ ఆరో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన అశుతోష్‌.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు కావాలి.

ఢిల్లీ ఐదో వికెట్‌ డౌన్‌
డేవిడ్‌ మిల్లర్‌ రూపంలో ఢిల్లీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మిల్లర్‌.. ఓవర్టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్‌(34), అశుతోష్‌ శర్మ(9)ఉన్నారు.

10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 91/4
10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్‌ స్టబ్స్‌(11), డేవిడ్‌ మిల్లర్‌(6) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 57 బంతుల్లో 121 పరుగులు కావాలి.

ఢిల్లీ నాలుగో వికెట్‌ డౌన్‌
ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అక్షర్‌ పటేల్‌.. గుర్‍జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్‌: 73/3

ఢిల్లీ రెండో వికెట్‌ డౌన్‌
పాథుమ్‌ నిస్సాంక రూపంలో ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగులు చేసిన నిస్సాంక.. అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
61 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌.. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిస్సాంక(41), రిజ్వీ ఉన్నారు.

సంజూ సూపర్‌ సెంచరీ.. సీఎస్‌కే భారీ స్కోర్‌
చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు అయూశ్‌ మాత్రే(59), దూబే(10 బంతుల్లో 20) రాణించారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే ఓ వికెట్‌ సాధించాడు. అయూశ్‌ మాత్రే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

సంజూ శాంసన్‌ సెంచరీ
17వ ఓవర్‌లో సంజూ శాంసన్‌ ఫోర్‌ బాది  సెంచరీ నమోదు చేశాడు
ఈ సీజన్‌లో  52 బంతుల్లో తొలిసెంచరీ చేశాడు
ఢిల్లీపై 3సిక్స్‌లు,14 ఫోర్లతో సంజూ సెంచరీ పూర్తి చేశాడు      

ఆయూష్‌ ఔట్‌ 
17వ ఓవర్‌లో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది
17వ ఓవర్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌ ఆయూష్‌ ఔటయ్యాడు  

55 బంతుల్లో సెంచరీ  భాగస్వామ్యం 
సంజు, ఆయుష్‌ రెండో వికెట్‌కు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు 
క్రీజులో సంజు 95, ఆయుష్‌ 55 
17 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 174/1 
12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 119-1, క్రీజులో సంజూ శాంసన్‌(77), ఆయూష్‌ మాత్రే(25) ఉన్నారు.

శాంసన్‌ హాఫ్‌ సెంచరీ
ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో సీఎస్‌కే సూప‌ర్ స్టార్ సంజూ శాంస‌న్ తొలి హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 52 ప‌రుగుల‌తో సంజూ త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 77/1

సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌
సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 62/. క్రీజులో సంజూ శాంస‌న్‌(46), అయూశ్ మాత్రే ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న సంజూ
సంజూ శాంసన్‌ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 27/1

టాస్‌ గెలిచిన ఢిల్లీ..
ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్‌ నబీ, అశుతోష్‌ శర్మ తుది జట్టులోకి వచ్చారు.

జమ్మూ కాశ్మీర్‌ పేసర్‌ అకిబ్‌ నబీకి ఇదే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. సీఎస్‌కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్‌ సీఎస్‌కే తరపున ఐపీఎల్‌ డెబ్యూ చేశాడు.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement