ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచస్ధాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.
దీంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్‌ను చూడడం ఇదే తొలిసారి. అతి పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి వైభవ్ కచ్చితంగా అర్హుడు" అని ధుమాల్ ఎక్స్‌వేదికగా కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు అర్హత సాధించాడు.
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వైభవ్ ప్రదర్శనలను అజిత్ అగార్కర్ అండ్ కో నిశితంగా పరిశీలిస్తోంది.
ఒకవేళ త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్‌కు వైభవ్ ఎంపికైతే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ ఆల్-టైమ్ రికార్డును వైభవ్ తిరగరాసే అవకాశం ఉంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.
చదవండి: ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ


