PC: BCCI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2026 వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న ప్లేయర్లను వదిలించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) వదిలేయడం హైలైట్‌గా నిలిచింది.
వేలంలోకి వదిలేశాయి
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13 కోట్ల ఆటగాడు శ్రీలంక పేసర్ మతీశ పతిరణను జట్టు నుంచి రిలీజ్ చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు)ని వేలంలోకి వదిలింది.
ఇక తాజా సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell- రూ. 4.2 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ వదలించుకుంది. కాగా నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ పర్సు వాల్యూ రూ. 110 కోట్లు. మరి తాజాగా అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఏ జట్టు పర్సులో ఎంత ఉంది? ఆయా జట్లలో ఉన్న ఖాళీలు ఎన్ని? తదితర వివరాలు చూద్దాం.
పది ఫ్రాంఛైజీల పర్సులో వేలం కోసం అందుబాటులో ఉన్న డబ్బు
💰గుజరాత్ టైటాన్స్- రూ. 12.9 కోట్లు
💰సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 25.5 కోట్లు
💰లక్నో సూపర్ జెయింట్స్- రూ. 22.95 కోట్లు
💰పంజాబ్ కింగ్స్- రూ. 22.95 కోట్లు
💰రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రూ. 16.4 కోట్లు
💰ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 21.8 కోట్లు
💰ముంబై ఇండియన్స్- రూ. 2.75 కోట్లు
💰కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 64.3 కోట్లు
💰రాజస్తాన్ రాయల్స్- రూ. 16.05 కోట్లు
💰చెన్నై సూపర్ కింగ్స్- రూ. 43.4 కోట్లు
👉కాగా వెంకటేశ్ అయ్యర్‌తో పాటు రూ. 12 కోట్ల విలువైన వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను వదులుకోవడంతో కోల్‌కతా ఖాతాలో అన్ని ఫ్రాంఛైజీల కంటే ఎక్కువ సొమ్ము ఉంది.
ఏ జట్టులో ఎన్ని ఖాళీలు?
🏏గుజరాత్ టైటాన్స్- 5 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏సన్‌రైజర్స్ హైదరాబాద్- 10 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏లక్నో సూపర్ జెయింట్స్- 6 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏పంజాబ్ కింగ్స్- 4 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 8 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏ఢిల్లీ క్యాపిటల్స్- 8 (✈️ఐదుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏ముంబై ఇండియన్స్- 5 (✈️ఒక విదేశీ ప్లేయర్‌కు చోటు)
🏏కోల్‌కతా నైట్ రైడర్స్- 13 (✈️ఆరుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
🏏రాజస్తాన్ రాయల్స్- 9 (✈️ఒక విదేశీ ప్లేయర్‌కు చోటు)
🏏చెన్నై సూపర్ కింగ్స్- 9 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు).
చదవండి: IPL 2026: పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు



