KKR vs RR: ఒక్క పరుగు తేడాతో ఓటమి | IPL 2025 KKR vs RR Toss Playing XIs Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 KKR vs RR: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌ ఓటమి

May 4 2025 2:55 PM | Updated on May 4 2025 7:27 PM

IPL 2025 KKR vs RR Toss Playing XIs Updates And Highlights

Photo Courtesy: BCCI

IPL 2025 KKR vs RR- Eden Gardens, Kolkata Updates: ఐపీఎల్‌-2025లో 53వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడ్డాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి.. రాజస్తాన్‌కు 207 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, రాజస్తాన్‌ ఆఖరి వరకు పోరాడి ఓటమిపాలైంది. 

ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ పైచేయి సాధించింది. ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలిచింది. రాయల్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 95 పరుగులతో చెలరేగగా.. మిగతా వాళ్లలో యశస్వి జైస్వాల్‌ (34), శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్‌) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి రెండేసి వికెట్లు కూల్చగా.. వైభవ్‌ అరోరా ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

దంచికొట్టిన రసెల్‌, రింకూ.. 
రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌ (11) మినహా మిగతా వాళ్లంతా మెరుగ్గా ఆడారు. మరో ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (25 బంతుల్లో 35), కెప్టెన్‌ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించగా.. ఆఖర్లో ఆండ్రీ రసెల్‌, రింకూ సింగ్‌ మెరుపులు మెరిపించారు.

రసెల్‌ 25 బంతుల్లో 57, రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్‌ 206 పరుగులు సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌, యుధ్‌వీర్‌ సింగ్‌ చరక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

కేకేఆర్‌ స్కోరు: 206/4 (20)
రాజస్తాన్‌ స్కోరు: 205/8 (20)

సెంచరీకి ఐదు పరుగుల దూరంలో
17.3: హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌ వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.
15.5: హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో సునిల్‌ నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హెట్‌మెయిర్‌ (29)

గేరు మార్చిన రాజస్తాన్‌
15 ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు: 155/5 
రియాన్‌ పరాగ్‌ 38 బంతుల్లో 86 పరుగులు, హెట్‌మెయిర్‌ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

పది ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు:  82-5
పరాగ్‌ 34, హెట్‌మెయిర్‌ 8 పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
7.5: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ హసరంగ బౌల్డ్‌ అయి.. జురెల్‌ మాదిరి సున్నా చుట్టి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 71/5 (7.5) .హెట్‌మెయిర్‌ క్రీజులోకి రాగా.. రియాన్‌ పరాగ్‌ 31 రన్స్‌తో ఉన్నాడు.
7.3: నాలుగో వికెట్‌ డౌన్‌
వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో జురెల్‌ బౌల్డ్‌. డకౌట్‌గా పెవిలియన్‌ చేరిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. స్కోరు: 71/4 (7.3). హసరంగ క్రీజులోకి వచ్చాడు.

6.6: మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
జైస్వాల్‌ (34) రూపంలో రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో జైసూ.. రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 66/3 (7). పరాగ్‌ 26 పరుగులతో క్రీజులో ఉండగా.. జైసూ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ వచ్చాడు.

పవర్‌ ప్లేలో రాజస్తాన్‌ స్కోరెంతంటే?
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా రాజస్తాన్‌ తిరిగి గాడిలో పడుతోంది. ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. జైస్వాల్‌ 18 బంతుల్లో 32, పరాగ్‌ 11 బంతుల్లో 22 పరుగులు చేశారు.

1.5: రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
మొయిన్‌ అలీ బౌలింగ్‌ కునాల్‌ సింగ్‌ రాథోడ్‌  (0) రసెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రియాన్‌ పరాగ్‌ క్రీజులోకి రాగా... జైస్వాల్‌ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 9-2. 

పాపం వైభవ్‌ సూర్యవంశీ.. మళ్లీ విఫలం
కేకేఆర్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 

జైస్వాల్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. కునాల్‌ సింగ్‌ రాథోడ్‌ క్రీజులోకి వచ్చాడు. కాగా వైభవ్‌ గత మ్యాచ్‌లో డకౌట్‌ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు మాత్రం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రాజస్తాన్‌ స్కోరు: 5/1 (1).

18.4: ఈ సీజన్‌లో రసెల్‌ తొలి అర్ధ శతకం
జోఫ్రా ఆర్చర్‌బౌలింగ్‌లో సిక్సర​ బాది యాభై పరుగుల మార్కు అందుకున్న రసెల్‌.

నాలుగో వికెట్‌ డౌన్‌
18.1: జోరు మీదున్న రఘువన్షీ అవుట్‌
రఘువన్షీ రూపంలో కేకేఆర్‌నాలుగో వికెట్‌ కోల్పోయింది. 30 బంతుల్లో 44 పరుగుల వద్ద ఉన్న అతడు జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అశోక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. రసెల్‌ 20 బంతుల్లో 45 పరుగులతో ఉండగా.. రింకూ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు. కేకేఆర్‌ స్కోరు: 173/4 (18.3) .

15 ఓవర్లలో కేకేఆర్‌ స్కోరు: 121/3
రసెల్‌ 2, రఘువన్షీ 36 పరుగులతో ఆడుతున్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
12.4: జోరు మీదున్న కేకేఆర్‌ కెప్టెన్‌ రహానే (30)ను రాజస్తాన్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ అవుట్‌ చేశాడు. పరాగ్‌ బౌలింగ్‌లో రహానే ధ్రువ్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ రూపంలో కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 111/3 (13). ఆండ్రీ రసెల్‌ క్రీజులోకి రాగా.. రఘువన్షీ 28 పరుగులతో ఆడుతున్నాడు.  
 

పది ఓవర్లలో కేకేఆర్‌ స్కోరు: 86/2 (10) 
రహానే 24, రఘువన్షీ 11 పరుగులతో ఆడుతున్నారు.

7.3: రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో ఓపెనర్‌ గుర్బాజ్‌ (35) హెట్‌మెయిర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రహానే 20 పరుగులతో ఆడుతుండగా.. అంగ్‌క్రిష్‌ రఘువన్షీ క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో ఓవర్‌ ముగిసే సరికి స్కోరు:72/2 (8).

పవర్‌ ప్లేలో కేకేఆర్‌ స్కోరు
గుర్బాజ్‌, రహానే నిలకడగా ఆడుతున్న క్రమంలో పవర్‌ ప్లే ముగిసేసరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి గుర్బాజ్‌ 24, రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
1.6: యుధ్‌వీర్‌ బౌలింగ్‌లో సునిల్‌ నరైన్‌ (11) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో కేకేఆర్‌ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అజింక్య రహానే క్రీజులోకి రాగా. రహ్మనుల్లా గుర్బాజ్‌ ఒక్క పరుగుతో ఉన్నాడు. కేకేఆర్‌ స్కోరు: 13-1 (2).

టాస్‌ గెలిచిన కేకేఆర్‌
రాజస్తాన్‌ రాయల్స్‌తో టాస్‌ గెలిచిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  ఈ సందర్భంగా కేకేఆర్‌ కెప్టెన్‌ రహానే మాట్లాడుతూ.. వికెట్‌ కాస్త పొడిగా ఉన్నట్లు కనిపిస్తోందన్నాడు. ఏదేమైనా మెరుగైన స్కోరు సాధించి.. దానిని తప్పక కాపాడుకుంటామని పేర్కొన్నాడు. మొయిన్‌ అలీ, రమణ్‌ దీప్‌ సింగ్‌ తిరిగి జట్టులోకి వచ్చినట్లు రహానే తెలిపాడు.

మూడు మార్పులు
ఇక రాజస్తాన్‌ సారథి రియాన్‌ పరాగ్‌ తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. నితీశ్‌ రాణా గాయపడ్డాడని.. అందుకే ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని తెలిపాడు. ఇక కుమార్‌ కార్తికేయ స్థానంలో హసరంగ వచ్చాడని.. అదే విధొంగా కునాల్‌ రాథోడ్‌, యుధ్‌వీర్‌లను ఆడిస్తున్నట్లు పరాగ్‌ చెప్పాడు.

తుదిజట్లు
కోల్‌కతా
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), అంగ్‌క్రిష్‌ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లవ్‌నిత్ సిసోడియా

రాజస్తాన్‌
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్‌), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), షిమ్రన్‌ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వాల్‌
ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, క్వెనా మఫాకా, అశోక్ శర్మ.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement