RR vs KKR
-
అతడు ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.అయితే, తాజా ఎడిషన్ ఆరంభం నుంచి ఈ జమైకన్ స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం డెబ్బై రెండు పరుగులే చేశాడు. అయితే, ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం రసెల్ దుమ్ములేపాడు.PC: BCCI25 బంతుల్లోనే 57ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రసెల్ 25 బంతుల్లోనే 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక రసెల్ ఇన్నింగ్స్ కారణంగా 200కు పైగా స్కోరు సాధించిన కేకేఆర్ రాజస్తాన్‌పై జయభేరి మోగించింది.ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడుఇక రసెల్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 129 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లలో బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. బౌలర్‌గా ఎనిమిది వికెట్లు తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, వయసు దృష్ట్యా ఐపీఎల్-2025 తర్వాత రసెల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై గెలుపు అనంతరం కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇంకో రెండు మూడు సైకిళ్ల పాటు అతడు ఐపీఎల్లో ఆడాలని భావిస్తున్నాడు. అంటే.. ఇంకో ఐదారేళ్లన్న మాట. అతడు ఫిట్‌గా ఉన్నాడు. బాగున్నాడు.వయసుతో పనేంటి?అలాంటపుడు వయసుతో పనేంటి? జట్టు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేసినంత కాలం ఓ ఆటగాడు ఆడుతూనే ఉంటాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ యాజమాన్యాలు ఇలాగే ఆలోచిస్తాయి. ఇలాంటి ఆలోచనా విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కాగా రసెల్ స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ చితక్కొట్టగలడని ఈ సందర్భంగా వరుణ్ స్పష్టం చేశాడు. కాగా 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి కోల్‌కతాతోనే కొనసాగుతున్నాడు.కాగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్తాన్‌పై ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇప్పటికి ఈ సీజన్లో రహానే సేన ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఐదు గెలిచి.. పట్టికలో ఆరోస్థానంలో ఉంది.ఐపీఎల్ 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్తాన్👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రీ రసెల్.చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే.. 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙈𝙖𝙣𝙞𝙖 𝙖𝙩 𝙀𝙙𝙚𝙣 𝙂𝙖𝙧𝙙𝙚𝙣𝙨 💪Display of brute force from #KKR's very own Andre Russell 💥Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @Russell12A pic.twitter.com/YfXiU3dF6h— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
ఇదేం ఆట?.. గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.45 బంతుల్లో 95 పరుగులుఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్ పరాగ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ (13వ ఓవర్)లో వరుస సిక్స్‌లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఐదు, ఆరో నంబర్ బ్యాటర్లు ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ కావడం పట్ల రియాన్ ఆగ్రహానికి లోనయ్యాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురెల్ (0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.చూపుతోనే చంపేసేలాఇక హసరంగ అవుట్ కావడాన్ని రియాన్ పరాగ్ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొంత మంది రియాన్ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్‌గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్ ఆదివారం కోల్‌కతాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.ఒక్క పరుగు తేడాతో ఓడిభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్. అయితే, రియాన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్‌తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్ రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖరారైంది. కేకేఆర్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.రాజస్తాన్ బ్యాటర్లలో రియాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. యశస్వి జైస్వాల్ (34), షిమ్రన్ హెట్మెయిర్ (29), శుభమ్ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్‌కు ధోని చెప్పిందిదే!Through the gate ✖ 2️⃣ \|/Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
నా బ్యాటింగ్ అద్బుతమే.. కానీ మా వాళ్లే అలా!.. అతడైతే గ్రేట్: రియాన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.అప్పటికి నా బ్యాటింగ్ అద్భుతమే..తాను ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పరాగ్ పేర్కొన్నాడు. ‘‘నేను అవుట్ కావడం తీవ్ర నిరాశపరిచింది. ఆఖరి రెండు ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ 18వ ఓవర్లోనే అవుటయ్యా.16, 17 ఓవర్లలో మేము ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాం. విజయ సమీకరణం విషయంలో నేను సరైన విధంగా లెక్కలు వేసుకోలేకపోయాను. మ్యాచ్‌ను విజయంతో ముగించి ఉంటే ఎంతో బాగుండేది.అవుటయ్యేంత వరకు నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. ఓడిపోయిన కెప్టెన్‌గా ఇంటర్వ్యూకు వెళ్లకూడదని నాకు నేనే పదే పదే చెప్పుకొన్నా’’ అని రియాన్ పరాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.మా ప్రదర్శన గొప్పగా లేదుఅదే విధంగా జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆఖరి ఆరు ఓవర్లలో మాకు మరింత మెరుగైన ఆప్షన్లు దొరికి ఉంటే బాగుండేది. ముఖ్యంగా బౌలర్ల విషయం గురించి చెబుతున్నా. ఏదేమైనా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు.మ్యాచ్‌ను పూర్తి చేసి ఉంటే ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదు. రసెల్ ఒక సమయంలో 10 బంతుల్లో రెండు పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత అతడు బ్యాట్ ఝులిపించిన తీరు చూడటానికి ముచ్చటగా అనిపించింది.ఈ మైదానంలో సులువుగానే సిక్సర్లు కొట్టవచ్చు. వికెట్ కాస్త ట్రికీగా ఉన్నా.. పర్లేదు కాస్త మెరుగైందే. అందుకే నా ప్రణాళికలు చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు సాగాను. మైదానంలో మా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అందుకే నేను ఇక్కడ ఇలా నిలబడాల్సి వచ్చింది’’ అని రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఓపెనర్ సునిల్ నరైన్ (11)ను అవుట్ చేసి యుధ్వీర్ శుభారంభమే అందించాడు. కానీ మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (35), కెప్టెన్ అజింక్య రహానే (30) ఇన్నింగ్స్ గాడిన పెట్టారు.ఈ క్రమంలో అంగ్క్రిష్ రఘువన్షీ (44) కూడా వీరికి సహకారం అందించగా.. ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ పూర్తిగా గేరు మార్చేశారు. ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. కేకేఆర్ స్కోరును 200 దాటించారు.రసెల్ (25 బంతుల్లో 57 నాటౌట్), రింకూ (6 బంతుల్లో 19 నాటౌట్) మెరుపుల కారణంగా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి.. కేకేఆర్ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ కేకేఆర్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (34) ఫర్వాలేదనిపించగా.. వైభవ్ సూర్యవంశీ(4) మరోసారి నిరాశపరిచాడు. ఇక కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ అయ్యారు.ఈ క్రమంలో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అతడికి తోడుగా షిమ్రన్ హెట్మెయిర్ (29) కాసేపు నిలబడగా.. రియాన్ అవుటైన తర్వాత కథ మారిపోయింది.పద్దెమినిదవ ఓవర్ నాలుగో బంతికి హర్షిత్ రాణా బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి రియాన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్ (12) శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్)తో కలిసి స్కోరు బోర్డును ముందు నడిపాడు. ఇద్దరూ కలిసి సింగిల్స్ , డబుల్స్ తీస్తూ పందొమ్మిదో ఓవర్లో 11 పరుగులు స్కోరు చేశారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. 2, 1, 6, 4, 6 స్కోరు చేసి రాజస్తాన్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. అయితే, ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా ఆర్చర్ రనౌట్ కావడంతో కథ కంచికి చేరుకుండానే ముగిసిపోయింది. చదవండి: IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమిSent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!
ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా రాజస్తాన్ ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది.ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35) రాణించగా.. సునిల్ నరైన్ (11) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే (30), అంగ్క్రిష్ రఘువన్షీ (44) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఆండ్రీ రసెల్ తొలి ఫిఫ్టీఇక ఆఖర్లో ఆండ్రీ రసెల్ (Andre Russel), రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించారు. రసెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 57 పరుగులతో చెలరేగగా.. రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో దుమ్ములేపారు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 206 పరుగులు సాధించింది.రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రాజస్తాన్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4), వన్‌డౌన్‌లో వచ్చిన కునాల్ సింగ్ రాథోడ్ (0) పూర్తిగా విఫలమయ్యారు.రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (0), వనిందు హసరంగ (0) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి కఠిన దశలో రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ హర్షిత్ రాణా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.పరాగ్ అవుటైన తర్వాత జోఫ్రా ఆర్చర్ (12), శుభమ్ దూబే (25 నాటౌట్) ఆఖరి బంతి వరకు పోరాడారు. కానీ చివరి బాల్‌కు మూడు పరుగులు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి ఆర్చర్ రనౌట్ కావడంతో రాయల్స్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్తాన్ 205 పరుగుల వద్ద నిలిచిపోయింది.ఫలితంగా కేకేఆర్ సొంతగడ్డపై ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌కు ఇది తొమ్మిదో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచిన కేకేఆర్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్ 2025: కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్👉కేకేఆర్ స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ విజయం👉ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్: ఆండ్రీ రసెల్చదవండి: శెభాష్ రియాన్!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
శెభాష్ రియాన్!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్ (KKR vs RR) కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలోనే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ తానున్నానంటూ బ్యాట్ ఝులిపించాడు.ఓ వైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత చెదరనీయకుండా నిలకడగా ఆడిన రియాన్ పరాగ్.. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చేశాడు. అప్పటికి రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగియగా స్కోరు 102-5గా ఉంది.పూనకం వచ్చినట్లుగా ఆ మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్ పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో బంతిని బాదేశాడు. పదమూడో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీకి చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని షిమ్రన్ హెట్మెయిర్ (29) ఎదుర్కొని సింగిల్ తీశాడు.ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ ఆ తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదాడు. ఇందుకు తోడు ఈ ఓవర్లో మొయిన్ అలీ ఓ వైడ్ కూడా వేశాడు. ఫలితంగా పదమూడో ఓవర్లో రాజస్తాన్‌కు ఏకంగా 32 పరుగులు వచ్చాయి. రియాన్ పరాగ్ స్కోరు 75 పరుగులకు చేరింది.సెంచరీకి ఐదు పరుగుల దూరంలో కాగా ఇలా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ద్వారా రియాన్ పరాగ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్ దురదృష్టవశాత్తూ.. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.పద్దెనిమిదవ ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాలుగో బంతికి షాట్ ఆడేందుకు బాల్‌ను గాల్లోకి లేపగా.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ అరోరా క్యాచ్ పట్టాడు. దీంతో రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న అతడు ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్తాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది.ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే👉క్రిస్ గేల్ 2012లో రాహుల్ శర్మ బౌలింగ్‌లో👉రాహుల్ తెవాటియా 2020లో కాటెరెల్ బౌలింగ్‌లో👉రవీంద్ర జడేజా 2021లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో👉రింకూ సింగ్ 2023లో యశ్ దయాళ్ బౌలింగ్‌లో👉రియాన్ పరాగ్ 2025లో మొయిన్ అలీ బౌలింగ్‌లో..ఐపీఎల్ 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్తాన్👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)చదవండి: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!𝙍𝙖𝙢𝙥𝙖𝙣𝙩 𝙍𝙞𝙮𝙖𝙣 🔥The #RR captain is in the mood tonight 😎He keeps @rajasthanroyals in the game 🩷Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @rajasthanroyals | @ParagRiyan pic.twitter.com/zwGdrP3yMB— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
KKR vs RR: ఒక్క పరుగు తేడాతో ఓటమి
IPL 2025 KKR vs RR- Eden Gardens, Kolkata Updates: ఐపీఎల్-2025లో 53వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్తాన్ రాయల్స్ తలపడ్డాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి.. రాజస్తాన్‌కు 207 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ పైచేయి సాధించింది. ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. రాయల్స్ బ్యాటర్లలో కెప్టెన్ రియాన్ పరాగ్ 95 పరుగులతో చెలరేగగా.. మిగతా వాళ్లలో యశస్వి జైస్వాల్ (34), శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు కూల్చగా.. వైభవ్ అరోరా ఒక వికెట్ దక్కించుకున్నాడు.దంచికొట్టిన రసెల్, రింకూ.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్ సునిల్ నరైన్ (11) మినహా మిగతా వాళ్లంతా మెరుగ్గా ఆడారు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 35), కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించగా.. ఆఖర్లో ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ మెరుపులు మెరిపించారు.రసెల్ 25 బంతుల్లో 57, రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 206 పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు. కేకేఆర్ స్కోరు: 206/4 (20)రాజస్తాన్ స్కోరు: 205/8 (20)సెంచరీకి ఐదు పరుగుల దూరంలో17.3: హర్షిత్ రాణా బౌలింగ్‌లో రియాన్ పరాగ్ వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.15.5: హర్షిత్ రాణా బౌలింగ్‌లో సునిల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హెట్మెయిర్ (29)గేరు మార్చిన రాజస్తాన్15 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 155/5 రియాన్ పరాగ్ 38 బంతుల్లో 86 పరుగులు, హెట్మెయిర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 82-5పరాగ్ 34, హెట్మెయిర్ 8 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్7.5: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ హసరంగ బౌల్డ్ అయి.. జురెల్ మాదిరి సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. స్కోరు: 71/5 (7.5) .హెట్మెయిర్ క్రీజులోకి రాగా.. రియాన్ పరాగ్ 31 రన్స్‌తో ఉన్నాడు.7.3: నాలుగో వికెట్ డౌన్వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో జురెల్ బౌల్డ్. డకౌట్‌గా పెవిలియన్ చేరిన వికెట్ కీపర్ బ్యాటర్. స్కోరు: 71/4 (7.3). హసరంగ క్రీజులోకి వచ్చాడు.6.6: మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్జైస్వాల్ (34) రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో జైసూ.. రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 66/3 (7). పరాగ్ 26 పరుగులతో క్రీజులో ఉండగా.. జైసూ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చాడు.పవర్ ప్లేలో రాజస్తాన్ స్కోరెంతంటే?ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా రాజస్తాన్ తిరిగి గాడిలో పడుతోంది. ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. జైస్వాల్ 18 బంతుల్లో 32, పరాగ్ 11 బంతుల్లో 22 పరుగులు చేశారు.1.5: రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మొయిన్ అలీ బౌలింగ్ కునాల్ సింగ్ రాథోడ్ (0) రసెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ క్రీజులోకి రాగా... జైస్వాల్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 9-2. పాపం వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ విఫలంకేకేఆర్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. జైస్వాల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. కునాల్ సింగ్ రాథోడ్ క్రీజులోకి వచ్చాడు. కాగా వైభవ్ గత మ్యాచ్‌లో డకౌట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు మాత్రం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రాజస్తాన్ స్కోరు: 5/1 (1).18.4: ఈ సీజన్లో రసెల్ తొలి అర్ధ శతకంజోఫ్రా ఆర్చర్బౌలింగ్లో సిక్సర బాది యాభై పరుగుల మార్కు అందుకున్న రసెల్.నాలుగో వికెట్ డౌన్18.1: జోరు మీదున్న రఘువన్షీ అవుట్రఘువన్షీ రూపంలో కేకేఆర్నాలుగో వికెట్ కోల్పోయింది. 30 బంతుల్లో 44 పరుగుల వద్ద ఉన్న అతడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అశోక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రసెల్ 20 బంతుల్లో 45 పరుగులతో ఉండగా.. రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. కేకేఆర్ స్కోరు: 173/4 (18.3) .15 ఓవర్లలో కేకేఆర్ స్కోరు: 121/3రసెల్ 2, రఘువన్షీ 36 పరుగులతో ఆడుతున్నారు.మూడో వికెట్ డౌన్12.4: జోరు మీదున్న కేకేఆర్ కెప్టెన్ రహానే (30)ను రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అవుట్ చేశాడు. పరాగ్ బౌలింగ్‌లో రహానే ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 111/3 (13). ఆండ్రీ రసెల్ క్రీజులోకి రాగా.. రఘువన్షీ 28 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో కేకేఆర్ స్కోరు: 86/2 (10) రహానే 24, రఘువన్షీ 11 పరుగులతో ఆడుతున్నారు.7.3: రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఓపెనర్ గుర్బాజ్ (35) హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. రహానే 20 పరుగులతో ఆడుతుండగా.. అంగ్క్రిష్ రఘువన్షీ క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో ఓవర్ ముగిసే సరికి స్కోరు:72/2 (8).పవర్ ప్లేలో కేకేఆర్ స్కోరుగుర్బాజ్, రహానే నిలకడగా ఆడుతున్న క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి గుర్బాజ్ 24, రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్1.6: యుధ్వీర్ బౌలింగ్‌లో సునిల్ నరైన్ (11) బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అజింక్య రహానే క్రీజులోకి రాగా. రహ్మనుల్లా గుర్బాజ్ ఒక్క పరుగుతో ఉన్నాడు. కేకేఆర్ స్కోరు: 13-1 (2).టాస్ గెలిచిన కేకేఆర్రాజస్తాన్ రాయల్స్‌తో టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. వికెట్ కాస్త పొడిగా ఉన్నట్లు కనిపిస్తోందన్నాడు. ఏదేమైనా మెరుగైన స్కోరు సాధించి.. దానిని తప్పక కాపాడుకుంటామని పేర్కొన్నాడు. మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు రహానే తెలిపాడు.మూడు మార్పులుఇక రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. నితీశ్ రాణా గాయపడ్డాడని.. అందుకే ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని తెలిపాడు. ఇక కుమార్ కార్తికేయ స్థానంలో హసరంగ వచ్చాడని.. అదే విధొంగా కునాల్ రాథోడ్, యుధ్వీర్లను ఆడిస్తున్నట్లు పరాగ్ చెప్పాడు.తుదిజట్లుకోల్కతారహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లవ్నిత్ సిసోడియారాజస్తాన్యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వాల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, క్వెనా మఫాకా, అశోక్ శర్మ. -
IPL 2025: ఏంటి.. రియాన్ పరాగ్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలుపుతో విజయాల ఖాతా తెరిచింది. ఈ సీజన్లో రాయల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.Fan breaches security to meet Riyan Parag! Cricket fever at its peak!🏃[ Video Credits: @JioHotstar, @IPL #RiyanParag #RRvsKKR ] pic.twitter.com/xzlrQW44uq— ◉‿◉ (@nandeeshbh18) March 26, 2025కాగా, చప్పగా సాగుతున్న నిన్నటి మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమాంతం మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. ఆ తర్వాత రియాన్‌ను కౌగిలించుకున్నాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ పిచ్ ఇన్వేడర్ను లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.So, Riyan Parag hired a boy and paid him 10,000 Rs to come onto the ground and touch his feet.What an attention seeker this guy is!#RRvsKKR pic.twitter.com/0w7gfW7lAC— Dr Nimo Yadav 2.0 (@niiravmodi) March 26, 2025ఇది చూసి జనాలు రియాన్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా అని కామెంట్లు చేస్తున్నారు. రియానే ఆ వ్యక్తికి డబ్బిచ్చి అలా చేయమని ఉంటాడని మరికొందరంటున్నారు. రియాన్ కాళ్లు మొక్కి జైలుకి (మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి వస్తే జరిమానా, జైలు శిక్ష లేదా స్టేడియం నుంచి బహిష్కరణ లాంటి శిక్షలు వేస్తారు) వెళ్లే సాహసం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో రియాన్ లోకల్ హీరో కాబట్టి ఫ్యాన్స్ ఉండటంలో తప్పేముందని అంటున్నారు. రియాన్ రాయల్స్‌కు కెప్టెన్ కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.సోషల్‌మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నా.. రియాన్ రాయల్స్‌కు స్టార్ ఆటగాడు. పైగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రియాన్ పుట్టి పెరిగింది కూడా నిన్న మ్యాచ్ జరిగిన గౌహతిలోనే. జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో ఆ రాష్ట్రానికి (అసోం) ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు అతనే. అలాంటప్పుడు అతనికి ఫ్యాన్స్ ఉంటే తప్పేముంది. సోషల్‌మీడియా యూజర్స్‌కు నచ్చినా నచ్చకపోయినా రియాన్ ఓ స్టార్ ఆల్‌రౌండర్. అతనిలో ఎంత టాలెంట్ లేకుంటే అతన్ని రాయల్స్ గత సీజన్‌కు ముందు రిటైన్ చేసుకుంటుంది..? అంత మంది సీనియర్లు ఉన్నా అతన్నే ఎందుకు కెప్టెన్ చేస్తుంది..?No way you risk getting fined, jailed or probably banned from the stadium to touch Riyan Parag's feet? 😭 pic.twitter.com/lPKgS9dJEB— Heisenberg ☢ (@internetumpire) March 26, 2025 -
‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?.. ఇలాంటి వింత చూడలేదు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో రాజస్తాన్ రాయల్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన పింక్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పుల వల్లే రాయల్స్‌కు భంగపాటు ఎదురైందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో ప్యూర్ బ్యాటర్‌ను ఎనిమిదో స్థానంలో పంపే ఏకైక జట్టు రాయల్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్ఈ మేరకు.. ‘‘కోల్‌కతాతో మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్. మీరు తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ గత మ్యాచ్‌లో 11 లేదా 12 బంతుల్లోనే 35 పరుగులు సాధించిన బ్యాటర్ శుభమ్ దూబేకు.. మీరు తుదిజట్టులో స్థానం ఇవ్వలేదు.ఆల్‌రౌండర్ వనిందు హసరంగను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. అతడు పట్టుమని పది పరుగులు చేయకుండా అవుటయ్యాడు. ఆ తర్వాతైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. శుభమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు.పవర్ హిట్టర్ షిమ్రన్ హెట్‌మెయిర్‌ను కాదని శుభమ్‌ను ఏడో స్థానంలో పంపించారు. అతడు విఫలమయ్యాడు. మరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన హెట్మెయిర్ కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి వింత చూడలేదుస్పెషలిస్టు బ్యాటర్.. అదీ టీ20 క్రికెట్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ప్రపంచంలో ఎక్కడైనా చూశారా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఏమని స్పందించాలో కూడా తెలియడం లేదు. వాళ్ల వింత నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా రాజస్తాన్ నాయకత్వ బృందంపై ఘాటు విమర్శలు చేశాడు.కాగా రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం వల్ల గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2025తో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆరంభ మ్యాచ్‌లలో సారథ్య బాధ్యతలకు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.బ్యాటర్ల వైఫల్యంపరాగ్ నాయకత్వంలో తొలుత రైజర్స్చేతిలో ఓడిన రాయల్స్.. రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29), సంజూ శాంసన్ (13) నిరాశపరచగా.. పరాగ్ (15 బంతుల్లో 25) కాసేపు అలరించాడు.ఇక, నితీశ్ రాణా(8) పూర్తిగా విఫలం కాగా... రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన హసరంగ ఐదో స్థానంలో వచ్చి 4 పరుగులకే నిష్క్రమించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 33) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.అయితే, గత మ్యాచ్‌లో అదరగొట్టిన శుభమ్ దూబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటివ్వని రాయల్స్.. ఇంపాక్ట్ప్లేయర్గా ఏడో స్థానంలో ఆడించింది. అతడు 12 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు.. హెట్మెయిర్ 8 బంతుల్లో 7 రన్స్ చేయగా.. ఆఖర్లో టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ (7 బంతుల్లో 16) కాస్త వేగంగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది.డికాక్ వన్‌మ్యాన్ షోఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ అదరగొట్టింది. ఆరంభంలోనే ఓపెనర్ మొయిన్ అలీ(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ దుమ్ములేపాడు. 61 బంతుల్లో 97 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Q for Quality, Q for Quinton 👌👌A sensational unbeaten 9⃣7⃣ runs to seal the deal ✅Scorecard ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/kbjY1vbjNL— IndianPremierLeague (@IPL) March 26, 2025మిగతా వాళ్లలో కెప్టెన్ అజింక్య రహానే 18, అంగ్క్రిష్ రఘువన్షీ 22 (నాటౌట్) పరుగులు సాధించారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన కేకేఆర్.. ఈ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. అంతకు ముందు కోల్‌కతా.. ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్ -
RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘెర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ అతి కష్టం మీద 151 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కేకేఆర్ బౌలర్లు చెలరేగిపోయారు. మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో ఆర్చర్ 2 సిక్సర్లు బాదడంతో రాయల్స్ 150 పరుగుల మార్కును తాకగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌ను క్వింటన్ డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్) చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. డికాక్ మరో ఎండ్ నుంచి రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారం తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు. డికాక్ రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు రాయల్స్ ఏ ఒక్క అవకాశం రాలేదు. డికాక్ బాధ్యతాయుతంగా ఆడి రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రాయల్స్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్కరు కూడా డికాక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు.వాస్తవానికి రాయల్స్ బ్యాటింగ్ చేసే సమయంలోనే మ్యాచ్‌ను కోల్పోయింది. ఆ జట్టు కనీసం 170-180 పరుగులు చేసుండాల్సింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ గెలుపుకు వీరు ఆదిలోనే బీజం వేశారు.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 170 పరుగులు స్కోర్ చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ వికెట్ (గౌహతి పిచ్) గురించి తెలుసు కాబట్టి కాస్త తొందరపడ్డాను. వేగంగా పరుగులు సాధించే క్రమంలో నేను చేయాల్సిన దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాను. నేను అదనంగా 20 పరుగులు చేసుంటే బౌలర్లకు ఫైటింగ్ చేసే అవకాశం ఉండేది.డికాక్ అద్భుతంగా ఆడాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాలన్నదే మా ప్రణాళిక. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలోనైనా మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకుందామనుకున్నాము. అదీ జరగలేదు. డికాక్ మాకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్నులాగేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత సీజన్లో జట్టు నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరింది. అలాగే చేశాను. ఈ సీజన్లో మేనేజ్మెంట్ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమంది. జట్టు అవసరాల కోసం ఎక్కడ బ్యాటింగ్ చేసేందుకైనా నేను సిద్దంగా ఉండాలి.గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో మాకు యువ జట్టు ఉంది. మేము చిన్న దశల్లో బాగా రాణిస్తున్నాము. దీన్నే మ్యాచ్ మొత్తంలో కొనసాగిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. మా తప్పులను ఒప్పుకుంటాము. వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా చూసుకుంటాము. కొత్త ఆలోచనలతో చెన్నైతో మ్యాచ్‌లో బరిలో నిలుస్తాము.కాగా, రియాన్ సారథ్యంలో రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో రియాన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియాన్‌ను ఇంకో అవకాశం ఉంది. నాలుగో మ్యాచ్ నుంచి శాంసన్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు. రాయల్స్ మార్చి 30న ఇదే గౌహతిలో సీఎస్కేతో తలపడనుంది. -
RR VS KKR: మొయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది: రహానే
ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌లో అంత మజా రాలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్ ఫీలయ్యారు. మ్యాచ్ ఇంత చప్పగా సాగడానికి పిచ్‌తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) రాయల్స్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. స్పిన్నర్లు మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్‌గా వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 5) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో (కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్ (రహానే) తీయగలిగాడు. మొయిన్ అలీ రనౌటయ్యాడు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్‌కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్ ఓ నాణ్యమైన ఆల్‌రౌండర్. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్‌తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొటుంది. ఈ మ్యాచ్ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది. -
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్ బౌలింగ్‌ను రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. రాయల్స్ బౌలర్లకు పీడకల మిగిల్చారు.ఫలితంగా ఆ జట్టు ఏకంగా 286 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాయల్స్ 242 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఇక తమ రెండో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగువాహతి వేదికగా బుధవారం కేకేఆర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్‌లో కోల్‌కతా (ఆర్సీబీ చేతిలో) కూడా ఓడిపోవడంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ల వైఫల్యం కొనసాగితే మాత్రం ఆ జట్టుకు మరో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా విదేశీ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఫజల్హక్ ఫారూకీలను తుదిజట్టులో కొనసాగించే అంశంపై యాజమాన్యం తీసుకునే నిర్ణయమే కీలకం కానుందని పేర్కొన్నాడు.4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?‘‘బౌలింగ్ విభాగంలో రాజస్తాన్ రాయల్స్‌కు ఆందోళన తప్పదు. ముఖ్యంగా జోఫ్రాపైనే ప్రస్తుతం అందరూ దృష్టి పెట్టారు. నిజానికి రాయల్స్ జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మిగతా జట్లలో ఎనిమిది మంది ఉన్నారు. అయితే, తమకున్న ఆరుగురిలో రాజస్తాన్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది.వాళ్లు గత మ్యాచ్‌లో ఆడారు. ఒకరేమో (జోఫ్రా) నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే నాసిరకమైన స్పెల్‌తో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మరొకరు ఫజల్హక్ ఫారూకీ.. జోఫ్రాతో పాటు అతడి బౌలింగ్‌నూ ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు.ప్రతి బౌలర్ కెరీర్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి చేదు అనుభవం ఉండటం సహజమే. అయితే, జట్టులో ఉన్న ఇద్దరు విదేశీ బౌలర్లు ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటే ఏం చేయాలన్న అంశంపై యాజమాన్యానికి స్పష్టత కొరవడుతుంది. వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు వేస్తేనే బెటర్.మఫాకాను ఆడించండిసౌతాఫ్రికా యువ బౌలర్ క్వెనా మఫాకాను జోఫ్రా లేదంటే ఫారూకీ స్థానంలో ఆడించండి. అయినా సరే.. రాజస్తాన్ బౌలింగ్ విభాగం కచ్చితంగా రాణిస్తుందని చెప్పలేం’’ అని ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇక రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. ఈసారి అతడు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) సాధిస్తాడని అంచనా వేశాడు.‘‘రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు నా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరేమో కెప్టెన్ రియాన్ పరాగ్. మరొకరు యశస్వి జైస్వాల్. ఈసారి జైసూ ఆరెంజ్ క్యాప్ గెలుపొందినా ఆశ్చర్యం లేదు. గత సీజన్లో అతడి ఫామ్ బాగాలేదు. అయినంత మాత్రాన ప్రతిసారి అలాగే ఉంటుందని భావించలేము’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా గత మ్యాచ్‌లో జైస్వాల్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇవ్వగా.. ఫారూకీ మూడు ఓవర్లు పూర్తి చేసి 49 రన్స్ సమర్పించుకున్నాడు. మహీశ్ తీక్షణ(2/52), సందీప్ శర్మ 2/51) పరుగులు ఇచ్చినా రెండేసి వికెట్లు తీయగలిగారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్