జూన్‌లో ఐర్లాండ్‌లో భారత్‌ పర్యటన | Indias Tour of Ireland in June | Sakshi
Sakshi News home page

జూన్‌లో ఐర్లాండ్‌లో భారత్‌ పర్యటన

Mar 22 2026 3:38 AM | Updated on Mar 22 2026 1:09 PM

Indias Tour of Ireland in June

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు బెల్‌ఫాస్ట్‌ నగరంలో ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. జూన్‌ 26న తొలి మ్యాచ్, జూన్‌ 28న రెండో మ్యాచ్‌ జరుగుతుంది. 

జూన్‌ 20న స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ముగిశాక భారత జట్టు ఐర్లాండ్‌కు బయలుదేరుతుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ జట్టుతో టీమిండియా ఐదు టి20 మ్యాచ్‌లు (జూలై 1, 4, 7, 9, 11), మూడు వన్డేలు (జూలై 14, 16, 19) ఆడుతుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement