బుమ్రా పునరాగమనం | Indian Star pacer Jasprit Bumrah selected for England ODI series | Sakshi
Sakshi News home page

బుమ్రా పునరాగమనం

Jun 22 2026 6:09 AM | Updated on Jun 22 2026 6:09 AM

Indian Star pacer Jasprit Bumrah selected for England ODI series

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే కోహ్లికి చాన్స్‌

న్యూఢిల్లీ: పనిభారం నేపథ్యంలో గత కొంతకాలంగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా  ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని అతడిని... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా గాయపడి అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకపోయిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని కూడా ఇంగ్లండ్‌ సిరీస్‌కు  ఎంపిక చేశారు. అయితే దానికి ముందు అతడు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిన అవసరముంది. 

వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో... 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అఫ్గాన్‌తో చివరి వన్డేలో సెంచరీతో చెలరేగినప్పటికీ యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కలేదు. గాయం నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా పేరును పరిశీలించలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై 14న తొలి వన్డే (ఎడ్జ్‌బాస్టన్‌), 16న రెండో వన్డే (సోఫీ గార్డెన్స్‌), 19న మూడో వన్డే (లార్డ్స్‌) ఆడనుంది. 

భారత వన్డే జట్టు: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, ఇషాన్‌ కిషన్, సుందర్, అక్షర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిధ్, హర్షిత్‌ రాణా, అర్‌‡్షదీప్, గుర్‌నూర్‌ బ్రార్‌.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement