చెస్‌ ఒలింపియాడ్‌: పసిడి వేటలో మరో విజయం | Indian mens team eighth win in a row | Sakshi
Sakshi News home page

చెస్‌ ఒలింపియాడ్‌: పసిడి వేటలో మరో విజయం

Sep 20 2024 3:48 AM | Updated on Sep 20 2024 3:48 AM

Indian mens team eighth win in a row

బుడాపెస్ట్‌: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. తద్వారా పసిడి వేటలో మరో ముందడుగు పడింది. గురువారం జరిగిన 8వ రౌండ్లో భారత్‌ 3.5–0.5తో ఇరాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.

తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌... డానెశ్వర్‌ బర్డియాపై గెలిచి పురుషుల జట్టుకు చక్కని ఆరంభమిచ్చాడు. అనంతరం దొమ్మరాజు గుకేశ్‌... పర్హామ్‌ మగ్సూద్‌ను ఓడించడంతో భారత్‌ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో పోరులో ప్రజ్ఞానంద... అమిన్‌ టబటబేతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 

నాలుగో మ్యాచ్‌లో విదిత్‌ గుజరాతి విజయంతో భారత్‌కు ఎదురులేని విజయం ఖాయమైంది. అతను డానెశ్వర్‌ బర్డియాను ఓడించడంతో భారత్‌ ఆడిన 8 రౌండ్లలోనూ గెలుపొందింది. ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో భారత్‌ ఇదే జోరు కొనసాగిస్తే ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ‘స్వర్ణ చరిత్ర’ లిఖిస్తుంది.  

Advertisement
 
Advertisement
Advertisement