Asia Cup 2025: ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ | Indian Cricket Team For Asia Cup Won’t Be Stopped But No Bilateral Sporting Ties With Pak Says Sports Ministry | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Aug 21 2025 5:41 PM | Updated on Aug 21 2025 6:24 PM

Indian Cricket Team For Asia Cup Won’t Be Stopped But No Bilateral Sporting Ties With Pak Says Sports Ministry

ఆసియా కప్‌-2025లో భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఖండాంతర టోర్నీలో దాయాదితో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. 

అయితే పాక్‌తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఉండవవి తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాక్‌లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో, తటస్థ వేదికలపై పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ లెక్కన సెప్టెంబర్‌ 14న దుబాయ్‌లో జరుగబోయే భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు లైన్ క్లియర్‌ అయినట్లే.

కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై అనుమానాలు ఉండేవి. ఈ టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్‌ పెడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఆసియా కప్‌ టోర్నీ సెప్టెంబర్‌ 9 నుంచి దుబాయ్‌, అబుదాబీ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. టీమిండియా సెప్టెంబర్‌ 10న దుబాయ్‌ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్‌ 14న పాకిస్తాన్‌తో.. సెప్టెంబర్‌ 19న ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్ట్‌ 19న ప్రకటించారు.

ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement