మూడు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని భారత్‌ గెలుపు   | India won by saving three match points | Sakshi
Sakshi News home page

మూడు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని భారత్‌ గెలుపు  

Apr 12 2024 4:24 AM | Updated on Apr 12 2024 4:24 AM

India won by saving three match points - Sakshi

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్‌ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్‌ చాన్‌ను ఓడించింది.

రెండో మ్యాచ్‌ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్‌ షువో లియాంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్‌ చాన్‌–ఎన్‌ షువో లియాంగ్‌ జంటపై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. టైబ్రేక్‌లో అంకిత జోడీ మూడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం విశేషం.   

Advertisement
 
Advertisement
Advertisement