అజేయంగా నిలిచి... టైటిల్‌ గెలిచి... | India Win FIH Hockey Womens Nations Cup Title | Sakshi
Sakshi News home page

అజేయంగా నిలిచి... టైటిల్‌ గెలిచి...

Jun 22 2026 6:01 AM | Updated on Jun 22 2026 6:36 AM

India Win FIH Hockey Womens Nations Cup Title

భారత మహిళల హాకీ జట్టుదే నేషన్స్‌ కప్‌ 

ఆక్లాండ్‌: లీగ్‌ దశలో కనబరిచిన జోరును నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ కొనసాగించిన భారత మహిళల హాకీ జట్టు నేషన్స్‌ కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్‌ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా వచ్చే ప్రొ లీగ్‌ సీజన్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. తుది పోరులో భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్‌ (4వ నిమిషంలో), సునెలితా టొప్పో (15వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.

 లీగ్‌ దశలో భారత జట్టు వరుసగా అమెరికా (3–2తో), జపాన్‌ (2–1తో), ఉరుగ్వే (3–2తో) జట్లపై గెలిచి... సెమీఫైనల్లో 6–0తో చిలీని ఓడించింది. నేషన్స్‌ కప్‌ టైటిల్‌ నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 2022లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. చాంపియన్‌ భారత జట్టు ప్రదర్శనకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement