IND-A vs ENG: 348 ప‌రుగుల‌కు భార‌త్‌-ఎ ఆలౌట్‌ | India A vs England Lions 2nd Unofficial Test: India-A bundled out for 348 | Sakshi
Sakshi News home page

IND-A vs ENG: 348 ప‌రుగుల‌కు భార‌త్‌-ఎ ఆలౌట్‌

Jun 7 2025 4:58 PM | Updated on Jun 7 2025 5:49 PM

India A vs England Lions  2nd Unofficial Test: India-A bundled out for 348

నార్తంప్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న రెండో అనాధికారిక  భార‌త్‌-ఎ జ‌ట్టు బ్యాట‌ర్లు రాణించారు. టాస్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌-ఎ జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 348 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 319/7 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త జ‌ట్టు.. అద‌నంగా 29 ప‌రుగులు చేసి త‌మ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇండియా బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 

168 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 116 ప‌రుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన కరుణ్‌ నాయర్‌ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సీనియర్ పేస‌ర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..జోష్ టంగ్, జార్జ్ హిల్ త‌లా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రో 13 రోజుల్లో..
ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త జ‌ట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి దిగ్గ‌జాలు లేకుండా ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ప్ర‌త్య‌ర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. రోహిత్ శ‌ర్మ స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం విధిత‌మే.

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement