నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ సిరీస్‌ | India vs England 2026: Live Streaming, Telecast, Full Schedule, Squads | Sakshi
Sakshi News home page

నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ సిరీస్‌

Jul 1 2026 1:19 PM | Updated on Jul 1 2026 1:49 PM

India vs England 2026: Live Streaming, Telecast, Full Schedule, Squads

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా.. ఇవాల్టి నుంచి ఇంగ్లండ్‌  పర్యటనలో వైట్‌బాల్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, జట్లు, ప్రత్యక్ష ప్రసారల వివరాలను ఇక్కడ చూద్దాం.

ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ జరుగనుంది. చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా భారతకాలమానం ప్ర​కారం ఇవాళ రాత్రి 10 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ లివ్‌, జియో హాట్‌స్టార్‌లో స్ట్రిమింగ్‌ జరుగనుంది.

పూర్తి షెడ్యూల్‌
జులై 1: తొలి టీ20- రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్‌ లీ స్ట్రీట్‌ రా. 10:00 గంటలకు)
జులై 4: రెండో టీ20 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (సా. 7:00 గంటలకు)
జులై 7: మూడో టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ (రా. 10:00 గంటలకు)
జులై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్ (రా. 10:00 గంటలకు)
జులై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్ (సా. 7:00 గంటలకు)

వన్డే సిరీస్
జులై 14: తొలి వన్డే – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (సా. 5:30 గంటలకు)
జులై 16: రెండో వన్డే – కార్డిఫ్ (సా. 5:30 గంటలకు)
జులై 19: మూడో వన్డే – లార్డ్స్, లండన్ (మ. 3:30 గంటలకు)

జట్లు..
భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ

ఇంగ్లండ్‌ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ష్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్

ఇంగ్లండ్‌ వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?
భారత్-ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్‌ల ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో అందుబాటులో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్‌ను సోనీ లివ్‌, జియో హాట్‌స్టార్‌ యాప్‌లలో వీక్షించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement