ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌: టాప్‌–10లో రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లి | ICC Test Batting Rankings released | Sakshi
Sakshi News home page

ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌: టాప్‌–10లో రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లి

Aug 29 2024 4:22 AM | Updated on Aug 29 2024 4:22 AM

ICC Test Batting Rankings released

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. టాప్‌–10లో భారత్‌ నుంచి ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం పడిపోయి 751 రేటింగ్‌ పాయింట్లతో ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని 740 రేటింగ్‌ పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. 

విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు పురోగతి సాధించి 737 రేటింగ్‌ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ 881 పాయింట్లతో తన ‘టాప్‌ ర్యాంక్‌’ను నిలబెట్టుకోగా... విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌; 859 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, మిచెల్‌ (న్యూజిలాండ్‌; 768 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. 

ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్‌ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఆరు స్థానాలు పడిపోయి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ అశి్వన్‌ 870 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 847 పాయింట్లతో హాజల్‌వుడ్‌ (ఆ్రస్టేలియా), బుమ్రా (భారత్‌) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement