నరైన్‌ ఆల్‌రౌండ్‌ షో.. మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విండీస్‌ ప్లేయర్‌

The Hundred Mens Competition 2023: Sunil Narine All Round Show, Oval Invincibles Won By 3 Wickets - Sakshi

మెన్స్‌ హండ్రెడ్‌ లీగ్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ బోణీ కొట్టింది. లండన్‌ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్‌ 2) జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. సునీల్‌ నరైన్‌ ఆల్‌రౌండ్‌ షోతో (20-9-14-2 & 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 13 నాటౌట్‌) ఓవల్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లండన్‌ స్పిరిట్‌.. నాథన్‌ సౌటర్‌ (3/34), సునీల్‌ నరైన్‌ (2/14), గస్‌ అట్కిన్సిన్‌ (1/22), టామ్‌ కర్రన్‌ (1/22), సామ్‌ కర్రన్‌ (1/31) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 131 పరుగులకు ఆలౌటైంది. రొస్సింగ్టన్‌ (21 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ వేడ్‌ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు), కెప్టెన్‌ లారెన్స్‌ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్‌) రెండంకెల స్కోర్లు చేశారు. 

అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్‌ జాక్స్‌ (6 బంతుల్లో 11; 2 ఫోర్లు), జోర్డన్‌ కాక్స్‌ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు), సామ్‌ కర్రన్‌ (28 బంతుల్లో 34; 5 ఫోర్లు), సామ్‌ బిల్లింగ్స్‌ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించగా.. ఆఖర్లో సునీల్‌ నరైన్‌ (5 బంతుల్లో 13 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించాడు. లండన్‌ బౌలర్లలో డేనియల్‌ వార్రాల్‌, జోర్డన్‌ థాంప్సన్‌, నాథన్‌ ఇల్లిస్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ క్రిట్చీల్లీ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన నరైన్‌కు మ్యాన్‌ ఆఫ్‌  ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top