
ద హండ్రెడ్ లీగ్-2025లో కావ్యా మారన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్) ఓనర్‌షిప్‌లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ తొలి విజయం సాధించింది. నిన్న (ఆగస్ట్ 7) వెల్ష్‌ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నస్టానికి 143 పరుగులు చేసింది.
వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో (42), స్టీవ్ స్మిత్ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కెప్టెన్ టామ్ ఏబెల్ 18, లూక్ వెల్స్ 0, టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ 10, సైఫ్ జైబ్ 13, పాల్ వాల్టర్ 15, క్రిస్ గ్రీన్ 3, డేవిడ్ పేన్ 0, జోష్ హల్ 3 (నాటౌట్), రిలే మెరిడిత్ 7 (నాటౌట్) పరుగులు చేశారు.
సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు తీయగా.. మొహమ్మద్ ఆమిర్, టామ్ లాస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్ మరో 11 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. జాక్ క్రాలే (38 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (15 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి సూపర్ ఛార్జర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. డేవిడ్ మలాన్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
వెల్ష్‌ఫైర్ బౌలర్లలో రిలే మెరిడిత్‌కు 2 వికెట్లు దక్కాయి. కాగా, ఈ సీజన్‌కు ముందే కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌లోని మొత్తం వాటాను కొనుగోలు చేసింది. ఈ జట్టుతో పాటు హండ్రెడ్ లీగ్‌లోని మరో మూడు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.