WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్‌.. పసికూనపై విండీస్‌ ఘన విజయం | T20 World Cup 2024: Hosein's fifer fashions West Indies 134-run Win Over Uganda, See Details | Sakshi
Sakshi News home page

T20 WC 2024: 5 వికెట్లతో చెలరేగిన అకిల్‌.. పసికూనపై విండీస్‌ ఘన విజయం

Jun 9 2024 10:24 AM | Updated on Jun 9 2024 10:38 AM

Hoseins fifer fashions West Indies 134-run win over Uganda

టీ20 వరల్డ్‌కప్‌-2024లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.

174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌల‌ర్ల దాటికి కేవ‌లం 39 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. విండీస్ స్పిన్న‌ర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా ప‌త‌నాన్ని శాసించ‌గా.. జోష‌ఫ్ రెండు, మోటీ, ర‌స్సెల్, షెఫెర్డ్ త‌లా వికెట్ సాధించారు. 

ఉగండా బ్యాట‌ర్ల‌లో జుమా మియాగీ(13) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. మిగితా బ్యాట‌ర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

విండీస్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ జాన్స‌న్ చార్లెస్‌(44) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌స్సెల్‌(30 నాటౌట్‌), పావెల్(23), పూర‌న్‌(22) ప‌రుగుల‌తో రాణించారు.   ఉగండా బౌల‌ర్ల‌లో కెప్టెన్‌ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్‌ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement