హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ! | Gautam Gambhir's Pick For Fielding Coach Rejected By BCCI: Report | Sakshi
Sakshi News home page

హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజ‌రిగిందంటే?

Jul 12 2024 8:59 AM | Updated on Jul 12 2024 1:42 PM

Gautam Gambhir's Pick For Fielding Coach Rejected By BCCI: Report

రాహుల్ ద్ర‌విడ్ వారసుడిగా భార‌త మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ను బీసీసీఐ మంగళవారం(జూలై 10)న నియమించింది.

హెడ్ కోచ్‌ను మాత్రమే ఎంపిక చేసిన బీసీసీఐ.. సపోర్ట్ స్టాప్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో భారత ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రోడ్స్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐని గంభీర్ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే గంభీర్ అభ్యర్ధనను బోర్డు తిరష్కరించినట్లు తెలుస్తోంది. 

సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఇండియన్సే ఉండాలని గౌతీకి  బీసీసీఐ  సూచించినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ రిపోర్ట్‌లు పేర్కొంది. కాగా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో మొత్తం కోచింగ్ స్టాప్ భారతీయులే ఉన్నారు. 
బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే ,ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ వ్యవహరించారు.

అయితే ద్రవిడ్‌తో పాటు వీరి పదవీ కాలం కూడా ముగిసింది. కాగా ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు మరి కొన్ని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా భారత క్రికెట్‌లో సమూలమైన మార్పులు తీసుకువచ్చాడు. 

మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్ అవార్డులను డ్రెస్సింగ్ రూమ్‌లో ఇవ్వడం అతడే ప్రారంభించాడు. శ్రీలం‍క పర్యటనకు ముందు భారత కోచింగ్ స్టాప్‌పై ఓ క్లారిటి వచ్చే అవకాశముంది. ఈ పర్యటనతోనే భారత జట్టు హెడ్‌కోచ్‌గా గంభీర్ ప్రయాణం మొదలు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement