
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సమంగా ముగించి ఊపిరి పీల్చుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఆసియాకప్-2025 రూపంలో మరో సవాలు ఎదురుకానుంది. ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును ఆగస్టు 19న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనే అవకాశముంది. అయితే ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు గౌతమ్ గంభీర్ మధ్యప్రదేశ్‌లోని శ్రీ మహాకాళ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించాడు.
గంభీర్ శుక్రవారం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో జరిగిన 'భస్మ ఆరతి'కి తన భార్య, కుమార్తెలతో కలిసి హాజరయ్యారు. ఈ ఆలయంలో గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గంభీర్ ఇంగ్లండ్ టూర్‌కు ముందు అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. అనంతం సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్‌తో తాడో పేడో తెల్చుకోనుంది.
ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ
చదవండి: గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందిన క్రికెటర్లు వీరే!.. సచిన్ ఒక్కడే ప్రత్యేకం