హైదరాబాద్‌కు నాలుగో విజయం | Fourth win for Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు నాలుగో విజయం

Oct 23 2023 4:03 AM | Updated on Oct 23 2023 4:03 AM

Fourth win for Hyderabad - Sakshi

జైపూర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా మిజోరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోరీ్నలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన మిజోరం సరిగ్గా 20 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.

అగ్ని చోప్రా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోసెఫ్‌ లాథన్‌కుమా (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లు రవితేజ (3/30), సీవీ మిలింద్‌ (2/18), చింతల రక్షణ్‌ రెడ్డి (2/20) మిజోరం జట్టును కట్టడి చేశారు. 115 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రోహిత్‌ రాయుడు (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ తిలక్‌ వర్మ (24 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్‌ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. నేడు జరిగే తదుపరి మ్యాచ్‌లో బరోడా జట్టుతో హైదరాబాద్‌ తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement