న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఐకాన్‌ కన్నుమూత | Former New Zealand Pacer Bob Blair Passed Away At 94 | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఐకాన్‌ కన్నుమూత

Jun 24 2026 4:28 PM | Updated on Jun 24 2026 4:43 PM

Former New Zealand Pacer Bob Blair Passed Away At 94

PC: IANS

న్యూజిలాండ్‌ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. కివీస్‌ ఐకానిక్‌ క్రికెటర్‌ బాబ్‌ బ్లేయర్‌ కన్నుమూశాడు. తన 94వ పుట్టినరోజే ఇంగ్లండ్‌తో ఆయన తుదిశ్వాస విడిచాడు. కాగా న్యూజిలాండ్‌ తరఫున 1952- 1964 మధ్య బాబ్‌ బ్లేయర్‌ పందొమ్మిది టెస్టులు ఆడారు. ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఖాతాలో 43 వికెట్లు ఉన్నాయి.

ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వెల్లింగ్‌టన్‌కు సుదీర్ఘకాలం పాటు ప్రాతినిథ్యం వహించిన బాబ్‌ బ్లేయర్‌ (Bob Blair).. 59 మ్యాచ్‌లలోనే 330కి పైగా వికెట్లు పడగొట్టాడు. 1956-57 సీజన్‌లో మొత్తంగా 46 వికెట్లు కూల్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బౌలర్‌గా నిలిచాడు. అదే సీజన్లో ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు తొమ్మిది వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటాడు.

ఆ విషాద ఘటనతో పాపులర్‌
న్యూజిలాండ్‌ జట్టు 1953లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అప్పుడు బ్లేయర్‌కు 21 ఏళ్లు. ఓవైపు మ్యాచ్‌కు రంగం సిద్ధం కాగా.. అదే సమయంలో అతడికి కాబోయే భార్య నెరిస్సా లవ్‌.. తంగివయ్ రైలు దుర్ఘటనలో మరణించదన్న వార్త వచ్చింది.

అయినప్పటికీ జట్టు కోసం బాధ దిగమింగిన బ్లేయర్‌ పదో నంబర్‌ బ్యాటర్‌గా రంగంలోకి దిగి.. బెర్ట్‌ సట్లిఫ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 33 పరుగుల జోడించాడు. సౌతాఫ్రికా స్పిన్నర్‌ హూ టేఫీల్డ్‌ బౌలింగ్‌లో సింగిల్‌ ఓవర్లోనే 25 పరుగులు రాబట్టడం నాడు వరల్డ్‌ రికార్డు.

కోచ్‌గానూ..
ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌ క్రికెట్‌, క్రికెట్‌ సౌతాఫ్రికా 2024లో ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్‌ కోసం.. తంగివయ్‌ షీల్డ్‌ను ప్రవేశపెట్టింది. కాగా 1986లో బార్బరాను పెళ్లి చేసుక్ను బ్లేయర్‌ ఆమెతో కలిసి చెషైర్‌లో సెటిల్‌ అయ్యాడు. క్వీన్స్‌లాండ్‌, జింబాబ్వే, సౌతాఫ్రికా, నార్తర్న్‌ ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లకు కోచ్‌గానూ వ్యవహరించాడు. 

చదవండి: ఒకరు వదిలించుకున్నారు.. మరొకరు దక్కించుకున్నారు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement