ఇరాన్‌ ఫుట్‌బాల్‌ అభిమానులకు ఎదురుదెబ్బ​ | FIFA Ban of Shah Era Iranian Flag From World Cup Games Let Stand | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: ఇరాన్‌ అభిమానులకు ఎదురుదెబ్బ​

Jun 16 2026 3:54 AM | Updated on Jun 16 2026 3:56 AM

FIFA Ban of Shah Era Iranian Flag From World Cup Games Let Stand

ఫిఫా ప్రపంచకప్‌ 2026 మ్యాచ్‌లకు ఇరాన్‌ విప్లవానికి ముందు ఉపయోగించిన జెండాను తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది. దీంతో ఆ జెండాను స్టేడియాల్లో అనుమతించాలని కోరిన ఇరానియన్‌ మూలాలున్న అభిమానులకు ఎదురుదెబ్బ తగిలింది.

FIFA అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం రాజకీయ, వివక్షపూరిత లేదా వివాదాస్పద చిహ్నాలను ప్రపంచకప్‌ వేదికల్లోకి అనుమతించరాదు. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాయిస్‌ ఆఫ్‌ లిబర్టీ’ అనే సంస్థతో పాటు దాని సభ్యుడు సామ్‌ కెర్మానియన్‌ కోర్టును ఆశ్రయించారు.

1979 ఇస్లామిక్‌ విప్లవానికి ముందు, మొహమ్మద్‌ రెజా పహ్లావి పాలనలో ఉపయోగించిన ఇరాన్‌ జెండాను ప్రదర్శించడం ద్వారా ప్రస్తుత ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకతను, ప్రజాస్వామ్య సంస్కరణలకు మద్దతును తెలియజేయాలనుకుంటున్నామని పిటిషనర్లు వాదించారు. అయితే ఆ జెండాను అనుమతిస్తే అభిమానుల మధ్య ఘర్షణలు, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫిఫా పేర్కొంది.

లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు న్యాయమూర్తి కర్టిస్‌ కిన్‌ ఇందుకు సంబంధించి తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఫిఫా నిషేధం కొనసాగనుంది. ఈ నిర్ణయం ఇరాన్‌-న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement