టౌంటన్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో మన అమ్మాయిల జట్టు ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో గెలుపొందిన హర్మన్ సేన.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో తేలిపోయింది.
సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యాస్తికా భాటియా(32), దీప్తి శర్మ(32) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్, డీన్ తలా వికెట్ సాధించారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఇంగ్లీష్ జట్టు 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆలిస్ క్యాప్సే (82), హీథర్ నైట్ (70*) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఇంగ్లండ్‌ను గెలిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 137 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ తలా రెండు వికెట్లు తీశారు.
చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?


