శుభ్‌మన్ గిల్‌తో జురెల్(ఫైల్ ఫోటో)
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయడ్డాడు. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా జురెల్ కుడి చేతి వేలికి గాయమైంది.
ప్రోటీస్ ఓపెనర్ లెసెగో సెనోక్వానే ఆఫ్ స్టంప్ వెలుపల డెలివరీని డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్‌లో ఉన్న జురెల్ క్యాచ్‌ను అందుకోవడానికి ప్రయత్నించగా.. బంతి అతడి చేతి వేలికి బలంగా తాకింది. వెంటనే తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.
కనీసం ఫిజియో రాకుండానే అతడు మైదానాన్ని వీడాడు. ఇప్పటివరకు తిరిగి అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. జురెల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ అనాధికారిక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఈ యూపీ క్రికెటర్ సెంచరీలతో చెలరేగాడు. అంతకుముందు విండీస్ సిరీస్‌లోనూ శతక్కొట్టాడు. దీంతో సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఆడించాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది.
రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నప్పటికి ధ్రువ్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. కానీ అంతలోనే జురెల్ గాయ పడడం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక భారత్-సౌతాఫ్రికా ఎ జట్ల మధ్య రెండో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 56 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయానికి 45 ఓవర్లలో 208 పరుగులు కావాలి.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. గంభీర్ మాస్టర్ మైండ్! 39 ఏళ్ల తర్వాత?


