CWC 2023 IND VS SA: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తుది జట్లు ఇవే | CWC 2023 IND VS SA: India Won The Toss And Choose To Bat | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS SA: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తుది జట్లు ఇవే

Nov 5 2023 1:36 PM | Updated on Nov 5 2023 3:59 PM

CWC 2023 IND VS SA: India Won The Toss And Choose To Bat   - Sakshi

రెండో వికెట్‌ ‍కోల్పోయిన టీమిండియా
టీమిండియా 93 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.  శుభ్‌మన్‌ గిల్‌(23) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో గిల్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ(40) తొలి వికెట్‌గా అవుటయ్యారు. రబడా బౌలింగ్‌లో బావుమాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 5) భారత్‌-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేయగా.. టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ స్థానంలో తబ్రేజ్‌ షంషి తుది జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు..
సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, తబ్రేజ్‌ షంషి, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
 

Advertisement
 
Advertisement
Advertisement