పోర్చుగ‌ల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రొనాల్డో | Cristiano-Ronaldo-Ends-60-Years-World-Cup-Record-Double Goals Vs-Uzbekistan | Sakshi
Sakshi News home page

పోర్చుగ‌ల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రొనాల్డో

Jun 24 2026 7:07 AM | Updated on Jun 24 2026 11:36 AM

Cristiano-Ronaldo-Ends-60-Years-World-Cup-Record-Double Goals Vs-Uzbekistan

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో పోర్చుగ‌ల్ జ‌ట్టు తొలి విజ‌యాన్ని అందుకుంది. గ్రూప్ 'కె'లో భాగంగా కాంగో జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో 'డ్రా' చేసుకున్న పోర్చుగల్ మంగళవారం ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో 5-0తో గెలుపొందింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (ఆట 6వ, 38వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా.... నూనో మెండెస్ (17వ నిమిషంలో), రాఫెల్ బియో (87వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. 

ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఖుసనోవ్ 60వ నిమిషంలో రెండు గోల్స్ సెల్ఫ్ గోల్ చేయ‌డంతో అవి పోర్చుగ‌ల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇక తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన  రొనాల్డో ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దుమ్మురేపాడు. మైదానంలో పాద‌ర‌సంలా క‌దిలిన రొనాల్డో డ‌బుల్ గోల్స్‌తో మెరిశాడు. ఈ నేప‌థ్యంలో క్రిస్టియానో రొనాల్డో 60 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. 

పోర్చుగ‌ల్ త‌ర‌ఫున ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ చేసిన రికార్డు ఆ జ‌ట్టు దిగ్గ‌జం, బ్లాక్ పాంథ‌ర్ అని పిలుచుకునే యూసేబియో పేరిట ఉంది. యూసేబియో 1966 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో తొమ్మిది గోల్స్ కొట్ట‌డం విశేషం. ప్రపంచవ్యాప్తంగా "బ్లాక్ పాంథర్"గా ప్రసిద్ధి చెందిన యూసేబియో, కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే ఆ ఘనతను సాధించాడు. వాటిలో ఆరు గోల్స్‌ను లివ‌ర్‌పూల్‌లోని గూడిసన్ పార్క్ సాధించాడు. అతని తొమ్మిది గోల్స్‌లో నాలుగు పెనాల్టీ స్పాట్ నుండి రాగా, మిగిలిన ఐదు ఓపెన్ ప్లే నుంచి వచ్చాయి. 

ఆ టోర్నీలో పోర్చుగ‌ల్ మూడో స్థానంలో నిలిచింది. 60 ఏళ్ల‌గా ఏ పోర్చుగీసు ఆట‌గాడికి సాధ్యం కాని రికార్డును రొనాల్డో తాజాగా హ్యూస్ట‌న్‌లో బ‌ద్ద‌లుకొట్టాడు. అయితే యూసేబియో ఒకే టోర్నీలో తొమ్మిది గోల్స్ కొడితే.. రొనాల్డో ఆరు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లు క‌లిపి 10 గోల్స్ కొట్ట‌డం గ‌మ‌నార్హం. 

అంతేకాదు ఈ మ్యాచ్‌లో గోల్‌ చేయడం ద్వారా వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో 2006 (1), 2010 (1), 2014 (1), 2018 (4), 2022 (1), 2026 (2) గోల్ చేసిన ఏకైక ప్లేయర్ రొనాల్డో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ చేసిన అతిపెద్ద వయస్కుడిగానూ రొనాల్డో (41 ఏళ్ల 138 రోజులు) రికార్డు సృష్టించాడు.

Read: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌.. అల్జీరియా సంచలన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement