అక్షర్ పటేల్‌తో వాషింగ్టన్ సుందర్ (PC: BCCI X)
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది.
ఫిట్‌నెస్ ఆధారంగా..
జింబాబ్వే పర్యటనలో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను తప్పించి.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అఫ్గాన్‌తో సిరీస్ ఆడిస్తామని తెలిపింది. ఇక గాయాల నుంచి జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి కోలుకున్నప్పటికీ.. ఫిట్‌నెస్ ఆధారంగానే వారు అఫ్గాన్‌తో సిరీస్ ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ విషయంలో మేనేజ్‌మెంట్ ఎందుకు ఇంత ఉదారంగా ఉంటుందో తనకు అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ రెండు, మూడు సిరీస్‌లకు ఓసారి గాయపడే ఆటగాడి కోసం ఇతరులను బలి చేయడం ఏమిటని ప్రశ్నించాడు.
రెండువారాల్లో ఏం మారింది?
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడతాడు. కానీ ఇటీవల గాయం వల్ల శ్రీలంకతో సిరీస్‌కు దూరమయ్యాడు. మరి రెండువారాల్లోనే అతడు ఎలా ఫిట్‌గా మారాడు?
ఇప్పటికీ అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకోలేదు. అలాంటపుడు జట్టుకు ఎంపిక చేసి ఏం ఉపయోగం? టీమిండియాకు ఎంపిక చేసే ముందు కనీసం కొన్ని మ్యాచ్‌లలో ఆడి.. ఫిట్‌నెస్ సాధించాడా? లేదా? అన్నది చూడాలి.
డాక్టర్ సర్టిఫికెట్‌తో ఆడేస్తారా?
కానీ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే చాలు ఆడిస్తామంటే ఎలా? వాషింగ్టన్ సుందర్ ప్రతీ రెండు, మూడు సిరీస్‌లకు ఓసారి గాయపడుతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో అతడి బౌలింగ్ బాగాలేదు.
నిజానికి టీ20 ఫార్మాట్‌తోనే అతడు టీమిండియాలోకి వచ్చాడు. ఆ తర్వాత తన ప్రదర్శనలతో టెస్టు క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. కానీ ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లో అతడు ఏమాత్రం సత్తా చాటడం లేదు’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్య విధానాలను విమర్శించాడు. అదే సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి గురించి చిక్కా స్పందించాడు.
ఇదేం పద్ధతి?
ఒకవేళ నితీశ్ గనుక మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే.. శివం దూబేకు బదులు నితీశ్‌నే తుదిజట్టులో ఆడించాలని సూచించాడు. ఏదేమైనా మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని.. అంతే తప్ప డాక్టర్ సర్టిఫికెట్‌తో ఓ ఆటగాడు సులువుగా టీమిండియాలోకి రాకూడదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పునరుద్ఘాటించాడు. చిన్నపుడు స్కూల్ ఎగ్గొట్టిన తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి.. చాలా మంది శిక్ష నుంచి తప్పించుకునే వాళ్లని.. టీమిండియాకు అలాంటి దుస్థితి రాకూడదని ఘాటు విమర్శలు చేశాడు.


