సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ | Cameron Green out of Test series opener in Durban | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ

Oct 6 2026 7:18 PM | Updated on Oct 6 2026 7:32 PM

Cameron Green out of Test series opener in Durban

source: X

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌కు​ ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ పొత్తికడుపు గాయం కారణంగా ఆ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఇవాళ ధృవీకరించాడు. 

గత వారం సౌతాఫ్రికాతోనే జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా గ్రీన్ గాయపడ్డాడు. కార్బిన్ బోష్ వేసిన బంతి గ్రీన్‌ పొత్తికడుపు ప్రాంతంలో బలంగా తగిలింది. దీంతో ఆ తర్వాత జరిగిన రెండు రోజుల టూర్ మ్యాచ్‌కు కూడా గ్రీన్ దూరమయ్యాడు. 

ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్నాడు. తొలి టెస్ట్‌ అక్టోబర్‌ 9 నుంచి డర్బన్‌లో జరుగనుంది. తొలి టెస్ట్‌కు గ్రీన్‌ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో బ్యూ వెబ్‌స్టర్‌ తుది జట్టులోకి రావచ్చు.

కాగా, 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్‌ సౌతాఫ్రికా ఇన్విటేషన్‌ ఎలెవెన్‌ జట్టుతో రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ సెంచరీతో కదంతొక్కాడు. స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ (61), అలెక్స్‌ క్యారీ (57) అ‍్ద సెంచరీలతో రాణించారు. ఈ సిరీస్‌లో రెండు, మూడు టెస్ట్‌లు గ్వెబెర్హా, కేప్‌టౌన్‌ వేదికలుగా అక్టోబర్‌ 18, 27 తేదీల నుంచి ప్రారంభమవుతాయి. 

ఇదీ చదవండి: జడేజా కంటే అక్షర్‌ బెటర్‌.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement