
టీమిండియాతో టెస్టు సిరీస్ ముగియడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ది హండ్రెడ్ లీగ్-2025లో బీజీ బీజీగా గడపనున్నారు. ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, స్మిత్, క్రాలీ వంటి స్టార్ ఆటగాళ్లు తమ తమ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం సరికొత్త పాత్రలో కన్పించనున్నాడు.
మెంటార్‌గా బెన్ స్టోక్స్..
ఈ మెగా టోర్నీలో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు మెంటార్‌గా స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ గురువారం ధ్రువీకరించింది. కాగా ఈ ఏడాది ఆరంభంలోనే స్టోక్స్ ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ది హాండ్రిడ్ లీగ్-2025 తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.
కానీ ఇప్పుడు ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా స్టోక్స్ తన సేవలను నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీకి అందించనున్నాడు. స్టోక్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ కొత్తేమి కాదు. ఇంతకుముందు 2021-24 వరకు సూపర్ ఛార్జర్స్ జెర్సీలో స్టోక్స్ కన్పించాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది పరుగులతో పాటు ఓ వికెట్ సాధించాడు.
ఫిట్‌నెస్ సమస్యల కారణంగా స్టోక్స్ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. స్టోక్సీ ఇప్పటికి గాయాలతో సతమతమవుతున్నాడు. భుజం గాయం కారణంగా భారత్‌తో జరిగిన ఆఖరి టెస్టుకు స్టోక్స్ దూరమయ్యాడు. అతడు టోర్నీ నుంచి తప్పకొన్నప్పటికి తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూపర్ ఛార్జర్స్ యాజమాన్యం నిర్ణయించకుంది.
అందుకే తమ జట్టు మెంటార్ ఈ గ్రేట్ ఆల్‌రౌండర్‌ను నియమించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని సూపర్ చార్జర్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 7న వెల్ష్‌ఫైర్‌తో తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టోక్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్.. 43.43 సగటుతో 304 పరుగులు చేశాడు. అంతేకాకుండా 17 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs WI: టీమిండియాకు భారీ షాక్!