
ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత సీనియర్ పురుషుల జట్టు.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ఆడబోయే టెస్ట్ మ్యాచ్‌ల వేదికలు మారాయి. అలాగే భారత సీనియర్ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్ వేదికలు.. సౌతాఫ్రికా-ఏ జట్టు భారత-ఏ జట్టుతో ఆడబోయే వన్డే మ్యాచ్‌ల వేదికలు కూడా మారాయి. వేదికల మార్పు అంశాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 9) అధికారికంగా ప్రకటించింది.
🚨 NEWS 🚨
BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.
Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA— BCCI (@BCCI) June 9, 2025
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 14 తేదీ వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వేదికను ఈడెన్ గార్డన్స్ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది. వేదిక మారినా మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగుతుంది.
నవంబర్ 14 నుంచి 18 వరకు టీమిండియా, సౌతాఫ్రికా మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌కు మార్చడం జరిగింది. వేదిక మారినా ఈ మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగనుంది. నవంబర్ నెలలో ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో వేదిక మార్చినట్లు బీసీసీఐ చెప్పుకొచ్చింది.
భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే చిదంబరం స్టేడియంలో ఔట్ ఫీల్డ్, పిచ్‌కు సంబంధించి మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో తొలి రెండు వన్డేను న్యూ ఛండీఘడ్‌లోని పీసీఏ స్టేడియంకు, చివరి వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది.
సౌతాఫ్రికా పురుషుల ఏ టీమ్ నవంబర్ 13, 16, 19 తేదీల్లో భారత ఏ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ సిరీస్ వేదికను చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు.