
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. మట్టి కుండలో మల్లన్నకు బెల్లంపాయసం నివేదించారు. పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కాగా దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించే కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ప్రారంభించారు. – కొమురవెల్లి(సిద్దిపేట)

మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం