
గంటలు
సంచులు..
8
2
యూరియా కోసం రైతన్న పాట్లు
కౌంటర్ వద్ద తొక్కిసలాట
దుబ్బాకటౌన్: రైతులు యూరియా సమస్యతో సతమతమవుతున్నారు. సరిపడా యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. యూరియా వచ్చిందని తెలియగానే పరుగులు పెట్టడం.. పెద్ద క్యూ కట్టి గంటల తరబడి నిరీక్షించినా.. చివరకు సంచి బస్తా దొరుకుతుందో లేదో అన్న ఆందోళన వారిని పట్టిపీడిస్తోంది. ఇది కొంతకాలంగా రైతన్నకు కునుకులేకుండా చేస్తోంది. యువకులు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వానను సైతం లెక్క చేయకుండా సోమవారం దుబ్బాక పీఏసీఎస్‌సీకి యూరియా వచ్చిందని తెలియగానే తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచి క్యూ లైన్ కట్టారు. రెండు సంచుల యూరియా కోసం ఏకంగా ఎనిమిది గంటల నిరీక్షణ తప్పడం లేదంటూ రైతన్నలు వాపోతున్నారు.
ఏఓతో రైతుల వాగ్వాదం
వేకువ జాము నుంచి యూరియా కోసం వేచి చూసినా దొరకకపోవడంతో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు. ఏఓ వ్యవహరించే తీరుతోనే తమకు యూరియా దక్కడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఏఓ కనుసైగల్లోనే యూరియా పక్కదారి పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఎస్‌ఐ కీర్తిరాజు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.
వేల మంది రైతుల క్యూ లైన్
దుబ్బాకకు యూరియా వచ్చిందనే తెలియగానే మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు ఉదయాన్నే వచ్చి క్యూలైన్ కట్టారు. వచ్చిన 560 యూరియా బస్తాల కోసం రెండు వేల మందికి పైగా లైన్ కట్టడం విశేషం. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో..
గంటల తరబడి నిరీక్షించినా దొరకని వైనం
కొంతమందికి ఇచ్చి మమ అంటున్న అధికారులు