
గుబులే..
చీకటి పడితే
● పట్టణాల్లో అంతంత మాత్రంగానే గస్తీ
● సొత్తు రికవరీ అంతంతే..
● ఈ ఏడాది ఇప్పటి వరకు 228 చోరీలు
సంవత్సరం కేసులు నష్టం రికవరీ
(రూ. కోట్లలో) (రూ. కోట్లలో)
2023 680 2.78 1.80 (65శాతం)
2024 6671.94 1.30 (67శాతం)
2025 228 రూ. 78లక్షలు రూ. 53లక్షలు (68 శాతం)
ఇప్పటి వరకు
చీకటి పడితే చాలు.. ఎవరి ఇంటికి కన్నం వేస్తారో.. ఎవరి ఇంటిలో దొంగతనం జరుగుతుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. దొంగల ముఠాలు తాళాలు వేసిన ఇళ్లను, వ్యాపార సముదాయాలను టార్గెట్ పెట్టుకుని అందినకాడికి దోచేస్తున్నారు. పట్టణాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల్లో గల ట్రాన్స్‌ఫార్మర్లను సైతం ధ్వంసం చేసి కాపర్ వైర్లను, ఆయిల్‌ను అపహరిస్తున్నారు. కేసులను ఛేదించడంతో పాటు చోరీలను నియంత్రించడంలో పోలీసులు వెనుకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రధాన కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో పోలీసుల నిఘా లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణాల్లో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనం సిద్దిపేటలోని విక్టరీ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ సెంటర్‌లో చోరీలే. దీంతో పట్టణంలో ఎంత పకడ్బందీగా పెట్రోలింగ్ ఉందో అర్థమవుతోంది. పోలీసులు ప్రధాన కూడళ్లు, వీధుల్లో మాత్రమే రాత్రి 11 గంటల వరకు గస్తీ నిర్వహిస్తూ తర్వాత మిన్నకుండిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గస్తీని పెంచి దొంగతనాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
రికవరీ అరకొరే..
జిల్లాలో అపహరణకు గురైన సొత్తు రికవరీ అంతంతమాత్రంగానే ఉంది. గత మూడేళ్లుగా 70శాతంలోపే రికవరీ ఉంది. పోయిన సొత్తు కోసం పలువురు ఫిర్యాదు దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోయిన సొత్తు వస్తుందా లేదా అని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఫిర్యాదు దారులు తిరుగుతున్నారు.
చోరీ ఘటనలు
● సిద్దిపేట పట్టణం వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత సోమవారం అర్ధరాత్రి రెండు మెడికల్ షాప్‌లలో దొంగలు పడ్డారు. విక్టరీ చౌరస్తా సమీపంలోని మెడికల్ షాప్‌లో రూ.1,500 నగదు పోగా, బీజేఆర్ చౌరస్తాలోని మెడికల్ షాప్‌లో ఏమీ పోలేదు.
● గజ్వేల్ పట్టణంలో ఒకే రోజు జూలై 26న అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. దాదాపు 20 గ్రామాలు బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
● ఈ నెల 11న జగదేవ్‌పూర్ మండలం నిర్మల్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో రూ.5లక్షల నగదు, 12 తులాల వెండి గోలుసులు, అర తులం బంగారు రింగులు దోచుకెళ్లారు. కర్రె మాధవి భర్త రెండేళ్ల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందాడు. కాగా రైతు బీమా ద్వారా రూ.5లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు బంధువులకు అప్పుగా ఇవ్వగా ఇటీవల తిరిగిచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా తల్లిగారి ఇంటికి వెళ్లారు. తాళం పగలగొట్టి ఉండటంతో స్థానికులు మాధవికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చి చూసేసరికి నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరణకుగురైనట్లు గుర్తించారు.
● మే 15న పట్టపగలే బాలాజీనగర్‌లో రెండు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. మూడు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.లక్ష నగదు దోచుకెళ్లారు.

గుబులే..

గుబులే..