
హాట్ స్పాట్‌లపై నిఘా ముమ్మరం
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: హాట్ స్పాట్‌లను రోజుకు మూడు, నాలుగు సార్లు సందర్శించి, మరింత నిఘా పెంచాలని సీపీ అనురాధ తెలిపారు. షీ టీమ్, భరోసా సెంటర్ సిబ్బందితో సీపీ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షీ టీమ్.. మహిళలు, బాలికలకు రక్షణ కవచంగా పనిచేయాలన్నారు. సంబంధిత ఏసీపీలు వారానికి ఒకరోజు షీటీమ్ కార్యక్రమాలపై మానిటర్ చేయాలన్నారు. సమావేశంలో మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ దుర్గ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
ములుగు(గజ్వేల్): ఫర్టిలైజర్ దుకాణ యజమానులు యూరియాను పక్కదారి పట్టించి, కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. వంటిమామిడిలోగల పలు ఫర్టిలైజర్ దుకాణాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా బ్యాగ్‌లను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. నకిలీ మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామన్నారు.
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరిచి, లబ్ధిదారులకు వేగంగా చెల్లింపులు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. వేగంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇంకా ప్రారంభించని చోట త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అధికారులు నగేశ్, స్వామి, తదితర అధికారులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన
దరిపల్లి చంద్రం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మంత్రి వివేక్‌ను పీసీసీ సభ్యుడు, భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం నగరంలో మంగళవారం కలిసినట్లు పార్టీ నాయకుడు రవితేజ తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దరిపల్లి చంద్రం కోరినట్లు తెలిపారు. అదేవిధంగా 50 ఏళ్లు ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రతి నెలా రూ.5వేల పెన్షన్‌ను అందించాలని విన్నవించినట్లు తెలిపారు. కార్మికుల పిల్లలకు విద్యలో స్కాలర్‌షిప్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ.10 లక్షలు, సాధారణ మరణమైతే రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగిన కార్మికులకు రూ. 3 లక్షలను ఇవ్వాలని మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్‌ను దరిపల్లి చంద్రం కోరారన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ సానుకూలంగా స్పందించారన్నారు. మంత్రిని కలిసిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెలిమిల రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నట్లు తెలిపారు.

హాట్ స్పాట్‌లపై నిఘా ముమ్మరం

హాట్ స్పాట్‌లపై నిఘా ముమ్మరం

హాట్ స్పాట్‌లపై నిఘా ముమ్మరం