
అనంతగిరిపల్లి కుంటకు గండి
యుద్ధప్రాతిపదికన పూడ్చివేత
వర్గల్(గజ్వేల్): కుండపోత వానతో అతలాకుతలమైన వర్గల్ మండలంలో వరద ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం అనంతగిరిపల్లిలోని కిష్టమ్మ కుంటకు భారీ గండి పడింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులతోపాటు ఎంపీడీఓ మచ్చేందర్, ఆర్‌ఐ రాజు, ఇరిగేషన్ ఏఈ అలీ, అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నీటి వృథాకు అడ్డుకట్ట పడేలా జేసీబీ యంత్రాలతో యుద్ధప్రాతిప్రదికన మరమ్మతులు చేపట్టారు. గండి పూడ్చివేశారు. కాగా వర్గల్ మండలంలో మంగళవారం 3.18 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ఇంకా పొలాల్లో వరద వీడలేదు.