మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

Jun 22 2023 2:48 AM | Updated on Jun 22 2023 11:57 AM

- - Sakshi

కొమురవెల్లి(సిద్దిపేట): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం గణపతిపూజ, స్వస్తివాచనం, రుద్రహోమం, అష్టోత్తర శతకళషాభిషేకం, అన్నపూజ, సహస్త్ర బిల్వార్చణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ దంపతులు హాజరై రుద్రహోమం, విశేష అభిషేక అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌, ఏఈవోలు అంజయ్య, శ్రీనివాస్‌, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్‌, ఆలయ ధర్మకర్తలు సౌజన్య, గిరిధర్‌, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రుద్రహోమం నిర్వహిస్తున్న కలెక్టర్‌ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ దంపతులు 1
1/1

రుద్రహోమం నిర్వహిస్తున్న కలెక్టర్‌ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement