విజయీభవ.. | - | Sakshi
Sakshi News home page

విజయీభవ..

Mar 14 2026 10:23 AM | Updated on Mar 14 2026 10:23 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 16 వరకు కొనసాగనున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. భౌతిక రసాయనశాస్త్రం, జీవశాస్త్రం మాత్రం రెండు రోజులు నిర్వహిస్తుండగా, మిగతా పరీక్షలు అన్ని ఒక్కోరోజు మాత్రమే జరుగనున్నాయి. జిల్లాలో 15,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందుకు గాను 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రాంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందు నుంచే విద్యార్థులను పంపించనున్నారు. 5 నిమిషాల వరకు ఆలస్యమైనా అనుమతి ఉంటుంది. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేటి నుంచే టెన్త్‌ పరీక్షలు

హాజరుకానున్న 15,358 మంది విద్యార్థులు

82 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ

Advertisement
 
Advertisement
Advertisement