సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

Mar 14 2026 10:23 AM | Updated on Mar 14 2026 10:23 AM

చేర్యాల(సిద్దిపేట): ప్రాచీన వరి విత్తనాలను సాగు చేయడం ద్వారా రైతులకు ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చేర్యాల డివిజన్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ జక్కుల తిరుపతి అన్నారు. శుక్రవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నారాయణపేట జిల్లాకు చెందిన 40 మంది రైతులకు సేంద్రియ వ్యవసాయం, ప్రాచీన వరి విత్తనాలు, పశుపోషణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ప్రజల ముఖ్య ఆహారం వరి బియ్యపు అన్నమని అన్నారు. నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, చిట్టి ముత్యాలు వంటివి తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. వీటిలో మంచి ప్రోటీన్లు, న్యూట్రిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయన్నారు. ఒక్కసారి ఈ విత్తనాలను సాగు చేస్తే ప్రతి యేటా వీటినే తిరిగి వాడుకోవచ్చని, దీంతో విత్తనాల ఖర్చు తగ్గి రైతుకు ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రతీరైతు ప్రాచీన వరి విత్తన సాగు చేయాలని, సాగు చేయాలనుకునే వారికి ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా విత్తనాలను ఇస్తామని చెప్పారు.

నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని శనివారం సిద్దిపేట అదనపు డీసీపీ కుశాల్కర్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి సందర్శించారు. ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్‌, సభా ప్రాంగణం, పార్కింగ్‌, రైతువేళా నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈసందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణం, సభాస్థలికి సంబంధించిన వివరాలను మేనేజర్‌ ప్రణయ్‌గౌడ్‌ పోలీస్‌ అధికారులకు వివరించారు.

రైల్వే పనులు

అడ్డుకున్న రైతులు

చిన్నకోడూరు(సిద్దిపేట): రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన అన్నదాతలు శుక్రవారం రైల్వే పనులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని గంగాపూర్‌కు రంగనాయకసాగర్‌ ఎడమ కాలువ ద్వారా సాగు నీరు అందేది. రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో సాగు నీరు అందించే కాలువ ధ్వంసమైంది. ఫలితంగా సాగు నీరు అందక సుమారు 400 ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని, తమకు న్యాయం చేయాలని రైల్వే అధికారులను కోరినా ఫలితం లేదని రైతులు తెలిపారు. చేసేదిలేదక ఆందోళనకు దిగామని చెప్పారు. గంట పాటు ధర్నా నిర్వహించడంతో సిద్దిపేట రూరల్‌ సీఐ శ్రీను, ఎస్‌ఐ చంద్రమోహన్‌ చేరుకుని పంట పొలాలు పరిశీలించారు. సంబధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రాచీన వరి విత్తన సాగే మేలు

Advertisement
 
Advertisement
Advertisement