పదోతరగతి పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఏడుగురు రూట్ ఆఫీసర్లు, 82 చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 24 స్టోరేజ్ పాయింట్ కస్టోడియల్ విధులు నిర్వహిస్తున్నారు.
– శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ
ఆల్ ది బెస్ట్
పరీక్షలు రాస్తున్న టెన్త్ విద్యార్థులకు శుభాశీస్సులు. 100% ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నా. కష్టపడి చదివారు. మీ కష్టం వృథా కాదు. మీ భవిష్యత్తు పునాది పదో తరగతే. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి. ఉత్తమ ఫలితాలు సాధించండి. సిద్దిపేట ముందు వరుసలో నిలవాలి. మీ అమ్మా నాన్నల ఆశయాలను, ఉపాధ్యాయుల సంకల్పాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నా.
– హరీశ్‌రావు, ఎమ్మెల్యే


