ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు

Mar 14 2026 10:23 AM | Updated on Mar 14 2026 10:23 AM

సిద్దిపేటజోన్‌: ప్రజా సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పథకాలు ఆపడం లేదని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేఆర్‌ భవన్‌లో 342మంది లబ్ధిదారులకు రూ.3.కోట్ల 42లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన వేదికగా మారుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ పథకం సిద్దిపేట నియోజకవర్గంలో చాలా బాగా ఉందని కితాబిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, తహశీల్దార్‌ హరికిరణ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కనకరాజు, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం

ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఇక్బాల్‌ మినార్‌ మైదానంలో ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రంజాన్‌ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల కోసం షాదీఖాన, కబ్రస్థాన్‌ కోసం రూ.50లక్షల చొప్పున మంజూరు చేస్తోందన్నారు. అనంతరం పలువురికి రంజాన్‌ తోఫాలను పంపిణీ చేశారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

కార్మిక శాఖ మంత్రి వివేక్‌

Advertisement
 
Advertisement
Advertisement